Tuesday, 12 June 2018

స్మార్ట్ ఫోన్ తో బ్రెయిన్ కేన్సర్



ఓ పదిహేను నిమిషాలు సెల్‌ఫోన్‌లో మాట్లాడితేనే చాలామందికి తలనొప్పి వస్తుంది. అలాంటిది 20 ఏళ్లుగా రోజూ గంటలకు గంటలు మాట్లాడుతూనే ఉన్నారు. దీంతో సెల్‌ రేడియేషన్‌ మెదళ్లను తూట్లు పొడుస్తోంది. ప్రాణాంతక కంతులతో కేన్సర్‌ దాడి చేస్తోంది. పెరుగుతున్న కేన్సర్‌ కేసులకు మొబైల్‌ ఫోన్‌ రేడియేషన్‌ కూడా ప్రధాన కారణమని తేల్చారు యూకే పరిశోధకులు. జర్నల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ లో ప్రచురితమైన వారి పరిశోధనా పత్రంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి.




రిపోర్టు ప్రకారం, గ్లియో బ్లాస్టామా మల్టీఫోర్మే (జీబీఎం)గా పిలిచే మెదడులో ప్రాణాంతక ట్యూమర్లకు మొబైల్‌ రేడియేషన్‌ ప్రధాన కారణం! తమ పరిశోధనలో భాగంగా యూకేలో గత 21 ఏళ్లలో నమోదైన 79,241 జీబీఎం కేసులను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ఇంగ్లండ్‌లో గత 20 ఏళ్లలో ప్రాణాంతక ట్యూమర్‌ కేసులు రెట్టింపు అయ్యాయని గుర్తించారు.

1995లో 1250 ఉన్న కేసులు ఇప్పుడు 3వేలకు పెరిగాయని వెల్లడించారు. మెదడులో జ్ఞాపకశక్తిని, మాటను ప్రభావితం చేసే భాగంలోనే కణతులు ఎక్కువగా ఏర్పడటంపై ఆందోళన వ్యక్తం చేశారు. మొబైల్‌ ఫోన్‌ రేడియేషన్‌ ఇందుకు చాలావరకూ కారణమని వెల్లడించారు. ఇంగ్లండ్‌లో బ్రెయిన్‌ ట్యూమర్‌ కేసులు పెరగడానికి మొబైల్‌ ఫోన్లు కారణమని అభిప్రాయపడుతున్నారు. సెల్‌ఫోన్‌ రేడియేషన్‌తోబాటు ఎక్స్‌రేలు, సిటి స్కాన్లు, అణు పరీక్షల అవశేషాలు జీబీఎం ట్యూమర్‌ కేసులకు కారణమని పరిశోధకులు వివరిస్తున్నారు.

No comments:

Post a Comment