Friday, 15 June 2018

ప్లాస్టిక్ తో కేన్సర్ ఖాయం

పర్యావరణంతోపాటు.. జంతుజాలం, మానవాళి పట్ల ప్లాస్టిక్‌ అత్యంత ప్రమాదకరమైనదని  సైంటిస్టులు చెబుతున్నారు. ప్రజలు నిత్యం తమకు తెలియకుండానే ప్లాస్టిక్‌ను తినేస్తున్నారు. నీళ్లు, పాలు, ఆహారం, నూనె, చివరికి ఇడ్లీ, సాంబర్‌లు కూడా ప్లాస్టిక్‌ కవర్లలోనే విక్రయిస్తున్నారు. ప్రజలు ప్లాస్టిక్‌ కవర్లు, ప్లాస్టిక్‌తో చేసిన వాడిపారేసే ప్లేట్లలో తింటున్నారు. అలా శరీరంలోకి వెళ్లే ప్లాస్టిక్‌ మానవుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావంచూపుతోంది. ఏకకాలంలో ఒక్కో వ్యక్తి రెండు మూడు జబ్బులతో బాధపడడానికి ఇదే కారణం అని వివరించారు.



ప్లాస్టిక్‌ కారణంగా చిన్నారులు మొదలు.. వృద్ధులదాకా అనేక వ్యాధుల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డెయిరీ పాలు, చక్కెర, తిపి పదార్ధాలు, కోలాలు, ఛాయ్‌, కాఫీ, చిరుతిండి కారణంగా శరీరంలో గ్లూకోజ్‌ శాతం మరింత పెరుగుతుందని, తద్వారా రోగాలు సంక్రమిస్తున్నాయని వివరించారు. కల్తీ ఆహారం కారణంగా చిన్నారులు కూడా కేన్సర్‌ బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్‌ కవర్లలోని పదార్థాలను తినడం మాని.. ప్రతిరోజూ శారీరక వ్యాయామం, జాగింగ్‌, నడక వంటివి చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. టెంకాయ, కొబ్బరి నీళ్లు, మట్టికుండలో నీళ్లను తాగాలని, మట్టి పాత్రల్లో వంట చేయడం ద్వారా బహుళ ప్రయోజనాలు ఉంటాయన్నారు.

No comments:

Post a Comment