ప్లాస్టిక్ కప్పులతో మాత్రమే కాదు, చాలా షాపుల్లో, టీ, కాఫీలు సర్వ్ చేయడానికి వాడే డిస్పోజబుల్ కప్పులు కూడా కేన్సర్ ముప్పును కలిగిస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఒకసారి వాడి పడేసేందుకు ఉపయోగపడే డిస్పోజబుల్ కప్పుల తయారీలో కూడా ప్లాస్టిక్, కృత్రిమ రబ్బర్ వస్తువుల తయారీలో వాడే ‘స్టైరిన్’ అనే రసాయనం కేన్సర్‌ను కలిగించగలదని వెల్లడించింది. నిజానికి ఈ రసాయనాన్ని ‘ బహుశ కేన్సర్‌కు దారితీసే అవకాశాలు గల రసాయనం’గా డబ్ల్యూహెచ్‌ఓ నలభై ఏళ్ల కిందటే గుర్తించింది.
ఈ రసాయనం వల్ల కేన్సర్ ముప్పు అవకాశాలు మరింతగా ఉంటాయని తాజా పరిశోధనల్లో తేలడంతో ఇప్పుడు దీనిని మరింత ప్రమాదకర పదార్థాల జాబితాలో చేర్చింది. డేనిష్ ప్లాస్టిక్ పరిశ్రమలో పనిచేసే 70 వేల మంది ఉద్యోగులపై ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కేన్సర్ (ఐఏఆర్‌సీ) నిపుణులు మూడున్నర దశాబ్దాల సుదీర్ఘ పరిశోధనలు కొనసాగించిన తర్వాత, డిస్పోజబుల్ కప్పుల తయారీకి ఉపయోగించే ‘స్టైరిన్’ రసాయనం కేన్సర్ ముప్పును కలిగించగలదని నిగ్గు తేల్చారు.
బాగుందండీ. మనం పీల్చే గాలి నాణ్యత తెలుసుకదా! అది కూడా నిశ్చయంగా కేన్సర్ కారకమే కదా! ఏంచేస్తా. ఇలాంటి ప్రపంచంలో ఉన్నందుకు మనను చూసి మనమే జాలిపడాలి మరి.
ReplyDelete