Monday 9 January 2017

క్యాన్సర్ అంటే ఏంటి..?

క్యాన్సరు అనే వ్యాధి శరీర నిర్మాణానికి కనీస అవసరమైన కణాలలో మొదలవుతుంది. ఇది దగ్గరి సంబంధం వున్న అనేక వ్యాధుల సముదాయం. దీనిని పూర్తిగా అర్థం చేసుకోవడానికి సాధారణమైన కణాలు ఎప్పుడు క్యాన్సరు కలిగించేవిగా మారుతాయో తెలుసుకోవాలి. శరీరం ఎన్నో కణాల సముదాయాలతో నిర్మిత మవుతుంది. సాధారణంగా కణాలు పెరిగి, విభజన చెందుతాయి. ఈ విభజన, కణాల వృద్ధి శరీరాన్ని ఆరోగ్యంగా వుంచడానికి అవసరము. కొన్నిసార్లు ఈ క్రమబద్దీకరణ అదుపు తప్పుతుంది.... శరీరానికి అవసరం లేక పోయినా క్రొత్తకణాలు ఏర్పడతాయి. పాతకణాలు క్షీణించవలసిన సమయంలో క్షీణించవు. ఈ విధంగా ఏర్పడిన కణాల సముదాయం కంతి లాగా గడ్డలాగా ఏర్పడుతాయి. దీనినే క్యాన్సరు గడ్డ అని, మారణ కంతి అని, రాచ కురుపు అని అంటారు. అన్ని గడ్డలు అపారకరమైనవికాదు. కొన్ని నిరపాయకరమైనవి కూడా వుంటాయి.




నిరపాయకరమైన కంతులను క్యాన్సరు గడ్డలు అనరు. వీటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించవచ్చు. ఇవి సాధారణంగా తిరగబెట్టవు. ఈ గడ్డలోని కణాలు శరీరంలోని వేరే అవయవాలకు వ్యాపించవు. అన్నిటికన్నా ముఖ్యమైనది. ఇవి ప్రాణాంతకం కాదు. అపాయకరమైన కంతులలోని కణాలు అసాధారణంగా వుంటాయి. ఇంకా ఇవి నియంత్రణ లేకుండా విభజన చెందుతూ పోతాయి. ఇవి తమ చుట్టూ వున్న కణజాలం లోనికి చొచ్చుకొనిపోయి వాటిని విచ్ఛిన్నం చేస్తాయి. ఈ క్యాన్సరు కణాలు కంతుల నుంచి విడిపోయి దూరంగా రక్తస్రావం లోకి లేదా శోషరస వ్యవస్థలోకి చేరుతాయి. రక్తనాళాల చివరి నిర్మాణంలో రక్తనాళికలు, సిరలు ధమనులు అన్ని కలిసి వుంటాయి. వీటి ద్వారానే రక్తం శరీరంలోని అన్నిభాగాలకూ వెళుతుంది.

1 comment: