Saturday 28 January 2017

వృషణాలపై కంతులు ప్రమాదం


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -పురుషుల్లో వృషణాలపై ఏర్పడే కంతులు,Testicular Tumours- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి .



                        పురుషులకు మాత్రమే పరిమితమైన సమస్య .. వృషణాలపై కంతులు ఏర్పడటం. వృషణాలపై ఏర్పడే కంతులు కేన్సర్‌ కానివి కావచ్చు.లేదా కేన్సర్‌ కంతులైనా కావచ్చు. వృషణాలపై కంతులు ఏ వయస్సు వారికైనా వచ్చే అవకాశాలున్నప్పటికీ, సాధారణంగా ఐదేళ్లలోపు చిన్నారుల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి. లేదా యుక్తవయస్సులోకి త్వరగా అడు గిడిన మగపిల్లల్లో కనిపిస్తాయి.వృషణాలపై ఏర్పడే ఈ కంతుల్లో అత్యధిక శాతం కేన్సర్‌ కాని కంతులే ఉంటాయి.

No comments:

Post a Comment