Friday 6 January 2017

పసుపుతో కేన్సర్ పరార్



పసుపుతో సర్వైకల్ కేన్సర్ ను నిరోధించే అద్భుతమైన మందును కోల్ కతాలోని చిత్తరంజన్ జాతీయ కేన్సర్ ఇన్ స్టిట్యూట్ శాస్త్రవేత్తలు రూపొందించారు. పసుపులో ఉండే సర్కుమిన్ అనే రసాయనం హ్యూమన్ పాపిలోమా వైరస్ ను నిరోధిస్తుందని, ఒకవేళ ఆ వైరస్ బారినపడినా దాన్ని తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. హ్యూమన్ పాపిలోమా వైరస్ మహిళల్లో సర్వైకల్ కేన్సర్ కు కారణమవుతుంది.


హ్యూమన్ పాపిలోమా వైరస్, సర్వైకల్ కేన్సర్ తో బాధపడుతున్న 400 మంది మహిళలపై ఐదేళ్ల పాటు పరిశోధన చేశారు. పసుపు నుంచి సర్కుమిన్ ను తాము రూపొందించామని, ఇది వైరల్, హ్యూమన్ పాపిలోమా వైరస్ నిరోధకంగా పనిచేస్తుందని పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త పార్థాబసు తెలిపారు.

No comments:

Post a Comment