Saturday 21 January 2017

పని ఒత్తిడితో కేన్సర్‌ ముప్పు!

 దీర్ఘకాలం పని ఒత్తిడితో ఉద్యోగం చేయడం వల్ల పురుషులలో కేన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాజా పరిశోధనలో వెల్లడైంది. అగ్నిమాపక సిబ్బంది, కర్మాగారాలల్లో పనిచేసే ఇంజనీర్లు, ఏరోస్పేస్‌ ఇంజనీర్లు, మెకానిక్‌ ఫోర్‌మెన్లు, రైల్వే ఎక్వి్‌పమెంట్‌ రిపేర్‌ వర్కర్లకు కేన్సర్‌ ముప్పు అధికమని కెనడాలోని మోంట్రియల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇందుకోసం వారు కొంతమంది వ్యక్తులపై పరిశోధనలు జరిపారు.


        15-30 సంవత్సరాలు, 30 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం ఒత్తిడితో ఉద్యోగం చేసినవారు కేన్సర్‌ బారిన పడ్డారని, 15 సంవత్సరాల కన్నా తక్కువ కాలం ఉద్యోగం చేసిన వారిలో కేన్సర్‌ లక్షణాలు లేవని శాస్త్రవేత్తలు తెలిపారు. ఉద్యోగ జీవితంలో వృత్తిపరమైన బాధ్యతలు, అభద్రతా భావం, పోటీతత్వం, ప్రమాదకరమైన పరిస్థితులు, సవాళ్లు వంటి అంశాలు కూడా వారిలో కేన్సర్‌ ముప్పుకు దోహదం చేస్తున్నాయని చెప్పారు.

No comments:

Post a Comment