Monday 9 January 2017

కేన్సర్ కు ఎన్నో కారణాలు

కణాలలోని జన్యువులలో కలిగే మార్పుల వలన సాధారణంగా కణాలు కలిగే మార్పుల వలన సాధారణంగా కణాల విభజన, పెరుగుదల, క్షీణించడం వంటి అంశాలపై నియంత్రణ కోల్పోతాయి. కొన్ని రకాల జీవిత విధానాలు, వాతావరణ మార్పుల మూలంగా సాధారణంగా వుండవలసిన జన్యువులు క్యాన్సరు పెరగడానికి అనుమతించేవిగా మారుతాయి. ఈ విధమైన జన్యు మార్పులకు ధూమపానం, ఆహారపుటలవాట్లు, సూర్యరశ్మిలోని అయనీకరణ వికిరణాలు క్యాన్సరుకు కారణమయ్యే కొన్ని పదార్థాలు.



         అనువంశికంగా జన్యువులలో వచ్చే మార్పుల వల్ల తప్పనిసరిగా అపాయకరమైన గడ్డలు ఏర్పడతాయని ఖచ్చితంగా చెప్పలేము కానీ, వచ్చే అవకాశాలు ఎక్కువ అని చెప్పవచ్చు. శాస్త్రజ్ఞులు ఈ విషయమై క్యాన్సరు వచ్చే అవకాశాలు ఎక్కువ లేక తక్కువ చేసే అంశాలను ఇంకా పరిశోధిస్తున్నారు. కొన్ని వైరసుల సూక్ష్మక్రిమి సంపర్కం మూలంగా క్యాన్సరు వచ్చే అవకాశాలు, అపాయం ఎక్కువ కావచ్చును కానీ, క్యాన్సరు అంటువ్యాధి కాదు. క్యాన్సరు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. గాయాలు, కందిపోయిన భాగం నుంచి క్యాన్సరు పుట్టదు.

No comments:

Post a Comment