Sunday 8 January 2017

బోన్ కేన్సర్‌తో ముప్పే లేదు


బోన్ కేన్సర్లు అంటే అవి కేవలం ఎముకల్లో పుట్టేవి మాత్రమే కాదు. కొన్ని సార్లు ఇతర భాగాల్లో ఉన్న కేన్సర్లు కూడా ఎముకలకు పాకవచ్చు. అలాగే ఎముకల్లో పుట్టిన కేన్సర్ ఇతర భాగాలకూ పాకవచ్చు . అయితే ఈ కేన్సర్లు అన్నింటికీ చాలా వేగంగా వ్యాపించే లక్షణం ఒక టుంది. ఎప్పుడైనా పిల్లలు ఎక్కువ రోజులు కుంటుతూ నడుస్తూ ఉంటే, ఏదోలే అనుకుంటే ఒక్కోసారి ప్రమాదం ముంచుకు రావచ్చు.అప్పుడెప్పుడో దెబ్బ తగిలిన తాలూకు నొప్పే అనుకుంటే అది ఆ తరువాత బాగా ముదిరిపోయిన బోన్ కేన్సర్ కావచ్చు అందుకే ఈ విషయమై ఎంత తొందరగా డాక్టర్‌ను సంప్రదిస్తే, అంత శ్రేయస్కరం.



ఎముకల్లో రెండు రకాల కేన్సర్ కణుతులు వస్తూ ఉంటాయి. వీటిని ప్రైమరీ, సెకండరీ బోన్ కేన్సర్స్ అంటూ ఉంటాం. ఎముకల్లో పుట్టేవి ఒక రకమైతే, శరీరంలోని ఇతర భాగాల్లో పుట్టి ఎముకల్లోకి పాకేవి రెండో రకం. అయితే ఎముకల్లో పుట్టే కేన్సర్ కణుతులు తక్కువే కాని. బయట ఎక్కడో పుట్టి, ఎముకల్లోకి విస్తరించేవే ఎక్కువ.
నిజానికి అన్ని రకాల కేన్సర్లూ ఎముకలకు పాకవచ్చు.అయితే కొన్నిరకాల కేన్సర్లు ప్రత్యేకించి, ప్రొస్టేట్ కేన్సర్ చాలా వేగంగా పాకుతుంది. అందుకే ప్రొస్టేట్ కేన్సర్ ఉన్నట్లు తేలిన వారికి వెంటనే బోన్ స్కాన్ చేయించడం తప్పనిసరి అవుతుంది. అలాగే కిడ్నీ కేన్సర్, లంగ్ కేన్సర్, థైరాయిడ్ కేన్సర్, రొమ్ముకేన్సర్‌లు కూడా ఎముక లకు పాకే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ కారణంగానే రొమ్ము కేన్సర్‌కు వైద్యచికిత్సలు తీసుకున్న తరువాత కూడా ప్రతి ఏటా బోన్‌స్కాన్ సూచిస్తారు.

No comments:

Post a Comment