Tuesday 17 January 2017

ప్రోస్టేట్‌ కేన్సర్‌కు సరికొత్త చికిత్స

ప్రోస్టేట్‌ కేన్సర్‌ మరణాలను నియంత్రించే ఓ కొత్త వ్యవస్థను శాస్త్రవేత్తలు అభిృద్ధి చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న విధానాలు కొంతమంది రోగులపై పనిచేయడం లేదు.. దీనికి ప్రత్యామ్నాయం ఏమిటనే విషయం వైద్యులకు అంతుపట్టడం లేదు. ఈ నేపథ్యంలో కణాలలో సిగ్నలింగ్‌ సర్క్యూట్‌ను లక్ష్యంగా చికిత్స చేస్తే ఫలితం ఉంటుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న కేన్సర్‌ మరణాలలో ప్రోస్టేట్‌ కేన్సర్‌ రెండో స్థానంలో ఉంది.


 ఊపిరితిత్తుల కేన్సర్‌ ప్రథమ స్థానంలో ఉండగా.. ప్రోస్టేట్‌ కేన్సర్‌ దాని తరువాతి స్థానంలో ఉంది. ఈ క్రమంలో కొత్త ఆవిష్కరణ ద్వారా ప్రోస్టేట్‌ కేన్సర్‌ బాధితులకు చికిత్స అందించవచ్చని ‘ది స్ర్కిప్స్‌ పరిశోధక సంస్థ’ పేర్కొంది. ఈ సర్క్యూట్‌లోని ఎన్‌ఎఫ్‌-కేబి ప్రొటీన్‌ కేన్సర్‌ కణితి పెరుగుదలకు తోడ్పడుతుందని కనుగొన్నట్లు స్ర్కిప్స్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ జున్‌ లి లుయో తెలిపారు. గతంలో ఈ కేన్సర్‌ కణితికి అందే పోషకాలను నియంత్రించడం ద్వారా వ్యాధిని నియంత్రించవచ్చని చెప్పారు. కొంతకాలం తర్వాత కేన్సర్‌ కణితి దీనికి నిరోధకత సంతరించుకుంటుందని, ఫలితంగా వ్యాధి నియంత్రణ కష్టంగా మారుతుందని జున్‌ వివరించారు. తాజా అధ్యయనంలో ఈ ఇబ్బందిని తొలగించే మార్గాన్ని కనుగొన్నట్లు వారు తెలిపారు.

No comments:

Post a Comment