Tuesday 31 January 2017

అతిగా వేయించిన చిప్స్ తింటున్నారా ?

ఈ రోజుల్లో స్నాక్స్ గా చిప్స్ తినడం మామూలు అయిపోయింది. అయితే మరి ఎక్కువ వేయించిన బ్రెడ్ ,ఆలు చిప్స్ లో ప్రాణంతక కేన్సర్ రసాయనం ఉందని వాటిని తింటే కేన్సర్ ని కొని తెచ్చుకున్నట్లే అని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పిండి పదార్దాలను అధిక ఉష్ణోగ్రతలో వేడి చేసి తింటే అక్రిలామైడ్ అనే రసాయనం ఉత్పత్తి అవుతుందని తెలిపారు. ఈ ప్రయోగం జంతువులపై జరిపిన ప్రయోగాల్లో వెల్లడైందని పరిశోధకులు తెలిపారు. వంటకాలను బంగారు వర్ణం వచ్చే వరకు మాత్రమే ఫ్రై చెయ్యాలి అని సూచించారు.



             కాబట్టి ఈసారి చిప్స్ తినే ముందు వాటి కలర్ చూసి తినండి. ఎందుకంటే బాగా వేయించిన చిప్స్ తో కేనస్ర్ వచ్చే ప్రమాదం ఉంది. మన ప్రమేయం లేకుండానే కేన్సర్ వచ్చే ఛాన్స్ ఎలాగో ఉంది. దీనికి తోడు మనం కేన్సర్ ను కొనితెచ్చుకోవడం అవసరం అంటారా. చెప్పండి. ఒక్క చిప్సే కాదు ఏ పదార్థమైనా అతిగా వేయించడం మంచిది కాదంటున్నారు నిపుణులు.

No comments:

Post a Comment