Tuesday 29 December 2015

మన వంటింట్లోనే కేన్సర్ నివారిణి



మనం వంటల్లో వాడే వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. కేన్సర్ కు నివారిణిగా వెల్లుల్లి అద్భతంగా పనిచేస్తోందని వారు చెబుతున్నారు. అలాగే శరీరంలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్ ను అరికట్టి, గుండెపోటు కూడా రాకుండా చేస్తోందంటున్నారు. రోజూ నాలుగు వెల్లుల్లి రెబ్బలు చితక్కొట్టి, కాసేపయ్యాక తింటే మంచి ఫలితం ఉంటుందని సూచిస్తున్నారు.

వెల్లుల్లిలో ఉండే ఆయోజేన్ రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది. అలాగే వాటిలో ఉండే అలిసిస్ యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గా పనిచేస్తుంది. దీంతో ఇన్ఫెక్షన్ల బారినపడే అవకాశం లేకుండా చేస్తుంది. వెల్లుల్లిలో ఉండే అలీల్ సల్ఫైడ్ లు కొన్ని రకాల కేన్సర్లకు నివారిణిగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

1 comment:

  1. ఉల్లి తల్లి లాంటిది వెల్లుల్లి అమ్మమ్మ (అనుభవంలో )లాంటిది .బాగుంది

    ReplyDelete