Monday 21 December 2015

చుక్క రక్తంతో కేన్సర్‌ గుర్తింపు!


finger-blood

కేవలం ఒక చుక్క రక్తంతో కేన్సర్‌ను సులభంగా కనుగొనే సరికొత్త విధానాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనిద్వారా అది ఏ విధమైన కేన్సర్‌, శరీరంలో ఏ ప్రదేశంలో ఉందో కచ్ఛితంగా తెలుసుకోవచ్చని వారు తెలిపారు. అమెరికాలోని ఉమే యూనివర్సిటీ, నెథర్లాండ్స్‌ పరిశోధకులు సంయుక్తంగా 283 మంది రక్తకణాల నమూనాలను ఈ నూతన పరీక్ష ద్వారా పరీక్షించారు.

ఇందులో 228 మందికి వివిధ రకాల కేన్సర్‌లతో బాధపడుతున్నారని తేలింది. మిగిలిన 58 మందికి ఎటువంటి కేన్సర్‌ లక్షణాలు లేవని నిర్ధారణ అయింది. ఈ అధ్యయనంలో అన్ని రకాల కేన్సర్‌లను గుర్తించగలిగామని ఉమే వర్సిటీ శాస్త్రవేత్త జోన్స్‌ నీల్సన్‌ తెలిపారు. కేన్సర్‌ ప్రారంభదశలో గుర్తించడం చాలా ముఖ్యమన్నారు.

No comments:

Post a Comment