Tuesday 22 December 2015

కేన్సర్ ఖేల్ ఖతం

కేన్సర్‌ నిర్మూలనకు రకరకాల చికిత్సలను శాస్త్రవేత్తలు కనుగొంటున్నది మనం చూస్తున్నాం. మొన్నటికి మొన్న ఒక్క టీకాతో కేన్సర్‌ను చంపిపారేయొచ్చని ఓ డాక్టర్‌ తన పరిశోధనలో వెల్లడించారు. తాజాగా ప్రోస్టేట్‌ కేన్సర్‌ను నిరోధించే సరికొత్త ఆవిష్కరణను ఆసే్ట్రలియా పరిశోధకులు కనుగొన్నారు. ప్రోస్టేట్‌ కేన్సర్‌ కణాల పెరుగుదలకు కారణమైన గ్లుటామైన్‌ను పంపిణీ చేసే నాళాల(పంపు)కు అడ్డుకట్ట వేస్తే.. కేన్సర్‌ కణాలు ఆకలితో అలమటించి చనిపోతాయని సిడ్నీ సెంటెనరీ ఇనిస్టిట్యూట్‌ పరిశోధకుడు జెఫ్‌ హోల్ట్స్‌ తెలిపారు.

ప్రస్తుతం సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకులతో కలిసి అదేపనిలో ఉన్నామన్నారు. కాగా, అండాశయ కేన్సర్‌లో కీమోథెరపీ చికిత్స ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో.. అసలు పనిచేస్తుందో లేదో తెలుసుకునే జీవసూచిక బయోమార్కర్‌ ను భారత సంతతికి చెందిన మాధురీ కోటి కనుగొన్నారు. కెనడా క్వీన్స్‌ యూనివర్సిటీలో ప్రస్తుతం ఆమె పనిచేస్తున్నారు.

No comments:

Post a Comment