Wednesday 16 December 2015

ప్రసూతి మరణాలు కన్నా కేన్సర్‌ మరణాలే అధికం



ప్రసూతి మరణాల కంటే వివిధ కేన్సర్లతోనే మహిళలు అధికంగా చనిపోతున్నారని, దేశంలో ఏటా లక్షా 23 వేల కేన్సర్‌ కేసులను గుర్తిస్తే, వీరిలో దాదాపు 66 వేల మంది బ్రెస్ట్‌, గర్భాశయ  కేన్సర్లతో చనిపోతున్నారని అసోసియేషన ఆఫ్‌ గైనకాలజిక్‌ అంకాలజిస్టు ఆఫ్‌ ఇండియా స్పష్టం చేసింది. గర్భాశయ కేన్సర్లు తగ్గుతున్నప్పటికీ బ్రెస్ట్‌ కేన్సర్లు పెరుగుతున్నాయని, ఈ రెండు కేన్సర్లను తొలిదశలోనే గుర్తిస్తే నయం చేయవచ్చని ఈ సంఘం పేర్కొంది.


            శారీరకంగా బరువు పెరగడం వల్ల రొమ్ము కేన్సర్లకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. రాత్రివేళల్లో ఉద్యోగాలు, గాలి వెలుతురు పరిమితంగా ఉన్న ఆఫీసుల్లో పనిచేయడం, ఏది పడితే అది తినడం.. తదితర కారణాల వల్ల హార్మోన్లలో సమతుల్యం దెబ్బతింటుందని  వివరించారు. లేటు వయసు పెళ్లి చేసుకోవడం, లేటు వయసులో పిల్లల్ని కనడం వల్ల కూడా బ్రెస్ట్‌ కేన్సర్లకు గురయ్యే ప్రమాదం ఉంటుందని తెలిపారు. గ్రామాల్లో ప్రతి 1000 మందిలో 8 మంది కేన్సర్‌ బారిన పడుతుండగా, పట్టణాల్లో ఈ సంఖ్య 30గా ఉందన్నారు.

No comments:

Post a Comment