Friday 11 December 2015

రేడియేషన్ థెరపీ రకాలు

రేడియేషన్ థెరపీని రెండు రకాలుగా ఇస్తారు. లోపల్నుంచి, బయట్నుంచి. ఎక్కువ మంది కేన్సర్ రోగులకు బైట నుంచి ఎక్కువ శక్తిగల ఎక్స్ రే కిరణాలను కేన్సర్ జబ్బు ఉన్న ప్రదేశంలోకి, చుట్టూ ఉన్న భాగంలోకి పంపిస్తారు. రేడియేషన్ ఇవ్వడానికి లీనియర్ యాక్సిలేటర్, కోబాల్ట్ మిషన్ వాడతారు. వివిధ యంత్రాలు వివిధ రకాల కేన్సర్ ను నయం చేస్తాయి. ఏ రోగికి ఏ యంత్రం వాడాలో డాక్టర్ నిర్ణయిస్తారు. రేడియేషన్ లో రోగులు రేడియోయాక్టివ్ అయ్యే పరిస్థితి ఉండదు.

        లోపట్నుంచి రేడియేషన్ పద్ధతిలో.. మిక్కిలి శక్తివంతమైన కిరణాల్ని కేన్సర్ ఉన్న భాగాల్లోకి ప్రసరింపజేస్తారు. వాటిని ఆనుకుని ఉండే మామూలు కణజాలం నశించదు. తక్కువ వ్యవధిలో ఎక్కవ శక్తివంతమైన కణాలు పంపడానికి వీలౌతుంది. ఈ చికిత్స జరిగేటప్పుడు రోగుల స్నేహితుల్ని గాని, బంధువుల్ని గాని అనుమతించరు.

No comments:

Post a Comment