Monday 28 December 2015

క్యాలీఫ్లవర్ తో ప్రోస్టేట్ క్యాన్సర్ దూరం

మీకు గోబీ సబ్జీ అంటే ఇష్టం ఉందా? లేదా? లేకున్నా తినాలి మరి. ఎందుకంటే కాలీఫ్లవర్ వల్ల ప్రోస్టేటు కేన్సర్ తగ్గిపోతుందట. అంతేనా.. ఆరోగ్యంగా ఉన్న కణాలకు ఎలాంటి సమస్య ఉండదట. కేన్సర్ లేని వారు కేలీఫ్లవర్ తింటే కేన్సర్ రాకుండా ఆపుతుందట. మన శరీరంలోని హెడీఏసీ ఎంజైమ్‌లనేవి కేన్సర్‌ను నిరోధించే జన్యువులు క్రియాశీలకం కాకుండా ఆపుతాయి. ఈ హెచ్‌డీఏసీ జన్యువులను కాలీఫ్లవర్‌లోని సల్ఫోరాఫెన్ నిరోధిస్తుందని ఓరెగాన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. 

హెచ్‌డీఏసీ ఎంజైమ్‌లను నిరోధించడం కేన్సర్ చికిత్సలో చాలా ముఖ్యమైన ప్రక్రియగా డాక్టర్లు పరిగణిస్తారు. అది ఆహారం వల్లే సాధ్యమైందంటే ఇక కేన్సర్ చికిత్స సులభమవుతుందని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. ఇక్కడ మరో విశేషమేమంటే కాలీఫ్లవర్‌లోని సల్ఫోరఫేన్‌ను కేన్సర్ నివారణకు వాడిని ప్రమాదం లేదని డాక్టర్లు నిర్ధారించారు. ఈ సల్ఫారఫేన్ అనే రసాయనం.. ఫైటో కెమికల్స్ అనే వర్గానికి చెందింది. ఇది ఆహారంలో తీసుకుంటే మంచిది కాబట్టి.. ఎంత తీసుకుంటే మంచిదో తెలుసుకుంటే కేన్సర్‌కు చికిత్స మరింత తేలికవుతుందని నిపుణుల అంచనా.

No comments:

Post a Comment