Wednesday 30 December 2015

పుట్టుమచ్చలతో కేన్సర్ గుర్తింపు


 
.  పుట్టుమచ్చలతో కేన్సర్‌ ముప్పును పసిగట్టవచ్చా.. అంటే అవుననే శాస్త్రవేత్తలు జవాబిస్తున్నారు. శరీరంపై వం దకు మించి పుట్టమచ్చలు ఉంటే కేన్సర్‌ ముప్పు ఎక్కువని తాజా అధ్యయనం వెల్లడించింది. కుడిచేతిపై పదకొండు.. అంతకంటే ఎక్కువ మచ్చలుంటే శరీరంపై మొత్తం వందకు పైగా మచ్చలు ఉంటాయని పరిశోధనలో తేలిందట.
ఇలాంటి వారికి చర్మ కేన్సర్‌ వచ్చే ప్రమాదం సగటు కన్నా ఎక్కువని కింగ్స్‌ కాలేజ్‌ పరిశోధకులు స్పష్టం చేశారు. ఇలాంటి పరిశోధన ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఇకపై పుట్టుమచ్చల నిపుణులకు గిరాకీ పెరుగుతుందని భావిస్తున్నారు. రోగులంతా డాక్టర్ల దగ్గరకు వెళ్లడం మానేసి మచ్చలు లెక్కపెట్టుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు.
.
 

No comments:

Post a Comment