Thursday 24 December 2015

వ్యాయామంతో కేన్సర్ తగ్గుతుందా..?

వ్యాయామం కేన్సర్ ను తగ్గిస్తుంది. రోజు వ్యాయామం చేస్తే శారీరక దారుడ్యం పెరుగుతోంది. అదే సమయంలో శరీరానికి అవసరమైన ఆక్సిజన్ ను అందుతోంది. ఇది సహజంగా అందరూ చెప్పే మాటే. శరీరానికి మనం చేసే వ్యాయామం వల్ల క్యాన్సర్ నుండి రక్షిస్తుందన్నది పరిశోధనల సారాంశం. అమెరికాకు చెందిన వెర్మాట్ విశ్వవిద్యాలయానికి చెందిన సుషన్ జి లకొస్కీ బృందం ఈ మేరకు తమ సర్వే ఫలితాలను వెల్లడించింది. ఈ బృందం మొత్తం 13,949 పై పరీక్షలు చేసింది.

ఫిట్నెస్ నిర్ధారణకు గాను నిర్వహించిన త్రెడ్ మిల్ టెస్ట్ లో 55 శాతం మంది శ్వాసకోశ క్యాన్సర్ ఉన్నట్లు కనుగొన్నట్లు ఈ బృందం చెప్పింది. వారిలో ;44 శాతం మంది కొలక్ట్రల్ క్యాన్సర్ వ్యాధిని నిర్థారించారు. రోజు వ్యాయామం చేసిన వారిలో గుండె సామర్ధ్యం పెరిగిందని ;తేలింది. అంతే కాదు 65 శాతం మందిలో కాన్సర్ కణాలు తగ్గినట్లు తమ పరిశోధనలో గుర్తించినట్లు వివరించారు. వ్యాయామం మంచి ఫిట్నెస్ కే కాదు ఇతర దీర్గకాలిక రోగాలను అదుపు ఉంచేందుకు దోహం చేస్తుందన్నది నిజం. మరి ఇక ఆలస్యం ఎందుకు కనీసం వాకింగ్ కు వెళదాం పదండి.;

No comments:

Post a Comment