కేన్సర్.. ఒకప్పుడు ఇది సినిమాల్లోనో, నవలల్లోనో పాత్రలకు వచ్చే వ్యాధి! ప్రత్యేకించి మనదేశంలో కేన్సర్ బాధితుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. కానీ, ఇటీవలి కాలంలో కేన్సర్ బారిన పడుతున్నవారి సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. అయితే.. మన జీవనశైలిలో కొన్ని చిన్నచిన్న జాగ్రత్తలను పాటించడం ద్వారా కేన్సర్‌ను నిరోధించే అవకాశం ఉందని ‘ద వరల్డ్ కేన్సర్ రిసెర్చ్ ఫండ్’ పరిశోధకులు చెబుతున్నారు.
ధూమపానం, మద్యపానం మానేసి, కేరట్ తినడం దగ్గర్నుంచీ.. వ్యాయామం చేయడం, ఇంటి పనులు చేసుకోవడం దాకా ఏడు పనులు చేస్తే చాలావరకూ కేన్సర్‌ను నిరోధించవచ్చంటున్నారు. కేన్సర్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వరల్డ్ కేన్సర్ రిసెర్చ్ ఫండ్ ఐ కెన్ పేరిట ప్రచారోద్యమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా తమ పేరు నమోదు చేసుకున్నవారికి కేన్సర్ బారినపడకుండా జీవనశైలిలో చేసుకోవాల్సిన మార్పులపై రోజుకో చిట్కా చొప్పున 21రోజులు పంపుతారు. ఆసక్తి ఉంటే www.wcrf-uk.org/uk/preventing-cancer సైట్‌లో ఈమెయిల్ వివరాలు ఇవ్వొచ్చు.

No comments:
Post a Comment