కేన్సర్ ట్రీట్ మెంట్ లో కీమోథెరఫీ అనేది అత్యంత కీలకమైనది. కేన్సర్ కణాలను నశింపజేయడానికి డాక్టర్లు చేసే ఈ ట్రీట్ మెంట్ నెలలు తరబడి చెస్తుంటారు. ట్రీట్ జరుగుతున్నంత కాలం ఆ మనిషి పడే బాధ వర్ణనాతీతం. వాస్తవానికి కీమోథెరపీకి ప్రత్యామ్నాయ మార్గాలను శాస్ర్తజ్ఞలు ఎప్పటి నుంచో అన్వేషిస్తున్నప్పటికి సరైన ఫలితాలు రావడం లేదు. అయితే తాజాగా లుకేమియా చికిత్స లో వాడే ఇబ్రుటినిబ్, ఇడిలాలిసిబ్ అనే రెండు రకాల మందులు కేన్సర్ చికిత్సకు మెరుగైన ఫలితాలను అందిస్తున్నాయని తాజా అధ్యయనంలో తెలిసింది.
ప్రాణాపాయ స్థితిలో కొట్టిమిట్టాడుతున్న వారికి మరికొంత కాలం జీవించే అవకాశం ఉందని శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు. కీమోథెరపీకి బదులుగానే కాకుండానే మూల కనాల మార్పిడి ప్రక్రియలోనూ ఈ కైనేజ్ ఇన్‌హిబిటార్స్ తరగతికి చెందిన ఇబ్రుటినిబ్, ఇడిలాలిసిబ్ డ్రగ్స్ బాగా పనిచేస్తున్నాయని గుర్తించారు. ఈ విధానంలో చికిత్స తీసుకున్నవారు జీవితం కాలం ఒకటి నుంచి రెండేళ్లు పెరుగుతున్నట్లు తెలిపారు. అయితే ఈ రెండు డ్రగ్స్ ను కలిపి వాడితే ఎలా ఉంటుందన్న అంశంపై ప్రస్తుతం పరిశోదన ప్రారంభించినట్లు వియాన్న జనరల్ హస్పిటల్ కు చెందిన ఉల్రిచ్ జగర్ తెలిపారు.

No comments:
Post a Comment