కేన్సరు
అనేది కొత్త వ్యాధికాదు. పురాతనకాలంలో దీన్ని "రాచపుండు" అని అనేవారు.
అయితే సామాన్యులకు కాక రాజులకే ఎందుకు వస్తుంది? బహుశా రాజుల భోగలాలస
జీవితం వలనేమో. ఇంకొకటైనా కావచ్చు. రాజులకొస్తే అది ప్రజలందరికీ వార్తా
విశేషం, కాని సామాన్య పౌరుడికొస్తే ఎవరు పట్టించుకుంటారు. అదలా వుంచితే,
కేన్సర్ అనే పదానికి గ్రీకులో "యెండ్రకాయ" లేదా "పీత" అని అర్థం. పీతకు ఎలా
అయితే శరీరం మధ్యనుండి నలువైపులా విస్తరించినట్లు కాళ్ళు ఉంటాయో, కేన్సరు
అదే పద్ధతిలో వ్యాప్తిచెందటం వలన దానిని "కేన్సరు" గా నామకరణం చేసారు.
కర్కాటక రాశిని ఆంగ్లంలో కేన్సర్ అంటారు, దాని రాశిగుర్తు పీత.
హిప్పోక్రేట్స్ అనే గ్రీకు తత్వవేత్త దీన్ని "కార్కినోమా" అని వర్ణించాడు. ఈ పదాన్నే ఆంగ్లంలో "కార్సినోమా" అంటారు.
అయితే అప్పటికీ ఇప్పటికీ శాస్త్రీయ విజ్ఞానం చాల అభివృద్ధి చెందింది.
కేన్సరు గురించి ఎన్నో విషయాలు తెలిసాయి. మౌలికంగా, కేన్సరుకు కారణాలు మన
జీవినసరళి . ముఖ్యంగా మూడు స్థూలమైన కారణాలు కేన్సర్ ను కలుగజేస్తాయి. అవి భౌతికమైనవి , రసాయనిక పదార్థాలు , జీవ సంబంధమైనవి . ఈ మూడు రకాల కారకాల తో పరస్పర సంబంధం వలన మన శరీరంలోని మౌలికమైన కణాల అనువంశిక పదార్థమైన జన్యువు లో ఉత్పరివర్తనాలు వస్తాయి.
No comments:
Post a Comment