పెళ్లికి వెళ్లాలా? పేరంటం ఉందా? మరైదేనా శుభకార్యం ఉందా!? అయితే… మహిళల
గోళ్లకు మంచి రంగు పడాల్సిందే. కొందరు యువతులు పెళ్లీ పేరంటాలతో సంబంధం
లేకుండా నిత్యం గోళ్లకు మెరుపు రంగు వేసుకుంటూనే ఉన్నారు. కానీ… నెయిల్
పాలి్‌షతో ముప్పుతప్పదని స్టాన్‌ఫర్డ్ వర్సిటీకి చెందిన కేన్సర్ వ్యాధి
నిపుణుడు డాక్టర్ థు క్వాచ్ హెచ్చరిస్తున్నారు. గోళ్ల రంగు తయారీలో
ప్రమాదకరమైన విష రసాయనాలు వాడుతున్నారట.
మరీ ముఖ్యంగా… శాస్త్రవేత్తలు ‘త్రి-విషాలు’గా పిలిచే టొలీన్, ఫార్మాల్డిహైడ్, డైబ్యుటైల్ థాలేట్‌లు నెయిల్ పాలి్‌షలో ఉన్నట్లు గుర్తించారు. గోళ్లరంగుకు మెరుపు, నునుపు వచ్చేందుకు ఈ రసాయనాలను ఉపయోగిస్తారు. వీటిలో.. ఫార్మాల్డిహైడ్ కేన్సర్ కారకం. టొల్యూన్ నాడీ వ్యవస్థపైన, పునరుత్పత్తి శక్తిపైనా ప్రభావం చూపిస్తుంది. డైబ్యుటైల్ థాలేట్ కూడా పునరుత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఈ ‘త్రి-విషాల’తోపాటు మరిన్ని ప్రమాదకర రసాయనాలూ గోళ్లరంగులో ఉన్నట్లు గుర్తించారు. అప్పుడప్పుడు గోళ్లరంగు పూసుకునే వాళ్లతోపాటు… ఎప్పుడూ వీటితోనే ఉంటూ, వినియోగదారులకు పూసే బ్యూటీ సెలూన్ల సిబ్బందికీ ఈ రసాయనాలు మరీ ప్రమాదకరమని నిపుణులు తెలిపారు.

No comments:
Post a Comment