శరీరంలోని కీలక అవయవాల్లోకెల్లా అతి పెద్దది, అతి ముఖ్యమైనది కాలేయం. ఆ అవయవమే కేన్సర్ బారిన పడితే? ఒకప్పుడైతే ఇది కలవరపెట్టే విషయమే. కానీ, ఆధునిక వైద్య విధానాలు ప్రవేశించాక ఇప్పుడా సమస్య మునుపటిలా కలవరపెట్టే అంశం కాకుండా పోయింది. ప్రత్యేకించి సర్జరీలోనూ, కీమో, రేడియేషన్ థెరపీల్లో వచ్చిన ఆధునిక రీతులు కాలేయ సంబంధమైన కేన్సర్‌ను అధిగమించడం సులభతరం చేశాయి.
కాకపోతే, లివర్ కేన్సర్ అనగానే డిప్రెషన్‌లోకి జారిపోకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి, విధిగా వైద్య చికిత్సలు తీసుకుంటే లివర్ కేన్సర్ నుంచి సంపూర్ణంగా విముక్తి పొందడం సాధ్యమేనంటున్నారు కేన్సర్ వ్యాధి నిపుణులు. లివర్ కేన్సర్లన్నీ ఒకే రకం కాదు. అందువల్ల వాటికి చేసే చికిత్సలు కూడా అన్నీ ఒకే రకంగా ఉండవు. కేన్సర్ రకాన్ని అనుసరించి, చికిత్సలు కూడా వేరువేరుగా ఉంటాయి. సహజంగా ఆల్ఫా-ఫీటో-ప్రొటీన్ అనేది శరీరంలో ఒక మిల్లీ మీటర్ లో 10 మేనోగ్రాముల కన్నా తక్కువే ఉంటుంది. అయితే, లివర్ కేన్సర్ ఉన్నవారిలోనూ, అండాశయంలో, వృషణాల్లో కణుతులు ఉన్నవారిలోనూ ఈ ప్రొటీన్ పరిమాణం పెరుగుతుంది. ప్రత్యేకించి లివర్ కేన్సర్ ఉన్నవారిలో ఈ ప్రొటీన్ పరిమాణం 500 మేనోగ్రాముల దాకా పెరుగుతుంది. అయితే , ఎఎఫ్ పి పెరిగినంత మాత్రాన కేన్సర్ వచ్చినట్టు కాదు. కాకపోతే, అలా పెరగడాన్ని ఒక హెచ్చరికగా మాత్ర గుర్తించాలి.
No comments:
Post a Comment