మన
శరీరం సరీగ్గా పనిచెయ్యాలంటే వాటిలో ఉన్న వివిధ అవయవాలు సరీగ్గా పని
చెయ్యాలి. ఆయా అవయవాలని సరీగ్గా పనిచేయించేవి వాటిలో ఉండే కణాలు.
వాటిల్లో కొన్ని కణాలు, చెయ్యవలసిన పని చెయ్యకుండా, అవలక్షణాల మూలంగా
అడ్డూ ఐపూ లేకుండా ఇష్టం వచ్చినట్లు తమ సంతతిని పెంచుకుంటూ ఉంటాయి. దానితో కొంతకాలానికి మంచి చేసే కణాల కన్నా చెడు
చేసేవి ఎక్కువయ్యి శరీరంలో జరగవలసిన పనులు సక్రమంగా జరగవు. అవయవాలు
పనిచెయ్యటం మానేస్తాయి. దీన్నే కేన్సర్ అంటారు.
మన శరీరం అంతా కణాల పుట్ట. వాటి వాటి జీవిత చక్రం ప్రకారం పాత కణాలు
చచ్చిపోతూ కొత్త కణాలు పుడుతూ ఉంటాయి. ఈ ప్రక్రియలు దైనందినమూ మన శరీరమనే
రసాయనిక శాలలో జరిగేవే. ప్రకృతి, చెడ్డ కణాలు వాటంతట అవే చంపుకునేటట్లు చేసింది. దానిని అపోప్తోసిస్ అంటారు. కానీ కొన్ని చెడ్డ కణాలు అన్నిలక్షణాలూ సరీగ్గానే
ఉన్నట్టు కనపడి, ప్రకృతి పరిశీలనలో చిక్కకుండా తప్పించుకుని బయటపడుతాయి. ఈ
అవలక్షణాలతోటే వాటి సంతానం పెరిగించుకుంటూ పోతాయి . ఇవి సరీగ్గా పనిచెయ్యవు సరికదా మంచి కణాల ఆహారానికి కూడా పోటీకి
వస్తాయి. దీనితో శరీరంలో అవి ఉన్న చోట ఆ అవయవానికి అవసరమయిన పని జరగదు.
అవయవాలు పనిచెయ్యటం మానేస్తాయి.
No comments:
Post a Comment