Wednesday, 20 April 2016

నేలమర్రితో కేన్సర్ కు చెక్

కేన్సర్‌ అంటే వారికి తెలియదు. కానీ ఆదివాసీలు రొమ్ముపై వచ్చే గడ్డలను తగ్గించుకోవ డానికి  నేలమర్రి  ఆకులను ఉపయోగిస్తారు. ఈ ఆకులను నూరి ముద్దచేసిపెట్టి కట్టు కడతారు. కొన్ని రోజుల్లోనే గడ్డలు తగ్గిపోతాయి. ఆధునిక పరిశోధకులు ఈ నేలమర్రి ఆకులను పరీక్షల నిమిత్తం అమెరికన్‌ కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌కి పంపారు. వారు నేలమర్రి ఆకులకు కేన్సర్‌ తగ్గించే గుణాలు ఉన్నాయని తెలియచేస్తూ ప్రాథమిక నివేదిక ఇచ్చారు.


                అలాగే మధుమేహం వ్యాధికి కూడా మూలికల ద్వారా అద్భుతమైన చికిత్స అందిస్తున్నారు గిరిజనులు. పాతాళ గరుడి, మారేడు చెట్టు, పొడపత్రి తీగ, ఇండుప చెట్టు- వీటి వేర్లతో పాటు ఆలం నేరేడు పిక్కలు, చండ్రచెట్టు పట్ట తీసుకుని యెండబెట్టి సమపాళ్లలో చూర్ణం చేసి, వన్త్రగాలితం చేసి చిటికెడు చూర్ణం చొప్పున రోజుకొకసారి వాడితే మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది.
               

నిత్య శృంగారంతో ప్రోస్టేట్ కేన్సర్ కు చెక్


మీరు ప్రొస్టేట్‌ కేన్సర్‌కు దూరంగా ఉందామనుకుంటున్నారా? ప్రస్తుతానికి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు లక్షా డబ్బై వేల మంది ఈ ప్రొస్టేట్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని “వరల్డ్‌ కేన్సర్‌ రీసెర్చ్‌ ఫండ్‌ సంస్థ” తెలియజేసింది. తాజాగ ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ పై చేసిన పరిశోదనలో ప్రతి రోజు శృంగారంలో పాల్గొంటే ప్రొస్టేట్‌ క్యాన్సర్ ను నివారించవచ్చు అంటున్నారు వైద్యులు.

నెలలో దాదాపు 21 సార్లు వీర్య స్ఖలనం చేసే వారిలో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం 23 శాతం వరకు తగ్గుతుందని హార్వర్డ్‌ పరిశోధకులు ఇటీవల వెల్లడించారు. రోజూ వీర్యం బయటకు పోతుండడంతోపాటు ఆక్సిటోసిన్‌, సెరటోనిన్‌, ప్రోలాక్టిన్‌ వంటి హార్మోన్ల విడుదల ప్రొస్టేట్‌ కేన్సర్‌ను అడ్డుకుంటాయని వారు తెలిపారు. అయితే, ఈ సరస శృంగారాలను మీ జీవితభాగస్వామితో మాత్రమే  నెరపడం,సురక్షితం అని వైద్యులు సూచిస్తున్నారు.

Tuesday, 19 April 2016

పచ్చకామెర్లతో కేన్సర్ ముప్పు

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము .


పచ్చకామెర్లను జాండిస్‌ అని వ్యవహరిస్తారు. నిరంతరం రక్తంలోని ఎర్రకణాల విచ్ఛిత్తి జరుగుతూ బిలురూబిన్‌ అనే రంగు పదార్థం తయారవుతుంటుంది. రక్తంలో ఈ బిలురూబిన్‌ పరిమాణం రెట్టింపు అయితే కామెర్లు అని నిర్ధారిస్తారు. వీరి చర్మం, కళ్లు పసుపుపచ్చ రంగులో కనిపిస్తాయి. పచ్చకామెర్లను నిర్లక్ష్యం చేస్తే కేన్సర్ కు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

వాయుకాలుష్యంతో కేన్సర్

వాయు కాలుష్యంతో కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ  హెచ్చరించింది.  ఈ ముప్పు ఆగ్నేయ ఆసియా దేశాల్లో అధికంగా ఉందని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా టాప్ 20 కాలుష్య నగరాల్లో ఆగ్నేయాసియాలో 14 ఉన్నాయి. ప్రపంచంలో ఏటా 8.2 మిలియన్ల మంది ఈ వ్యాధితో మరణిస్తున్నాని, వీటిల్లో మూడింట రెండో వంతు మరణాలు మధ్య, దిగువ మధ్య తరగతి వర్గాల్లోనే ఉన్నాయంది. మరణాల్లో 22 శాతం పొగాకు, దాని ఉత్పత్తులు వాడకంతో సంభవిస్తున్నాయని పేర్కొంది. డబ్ల్యూహెచ్‌ఓ ఆగ్నేయ ఆసియా రీజియన్‌లో భారత్‌తో పాటు బంగ్లాదేశ్, భూటాన్, డీపీఆర్ కొరియా, ఇండోనేసియా, మాల్దీవ్స్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయ్‌లాండ్ ఉన్నాయి.

ఈ ప్రాంతంలోని పరిశ్రమల్లో కార్మికులకు సూర్య కిరణాలు, కేన్సర్ కారక రసాయనాల నుంచి  రక్షణ లేదు. మద్యపానం, అనారోగ్యకర ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం వంటివి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ఆటంకాలుగా మారాయి. పొగాకు, మద్యం వాడకం తగ్గించే దిశగా, పర్యావరణ పరిస్థితుల నుంచి కార్మికులకు రక్షణ కల్పించేలా కఠిన చట్టాలు తేవాలని డబ్ల్యూహెచ్‌ఓ ఆగ్నేయ ఆసియా డెరైక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ చెప్పారు. ప్రపంచ కేన్సర్ దినం సందర్భంగా ఆమె ఈ వివరాలు వెల్లడించారు. అలాగే హ్యూమన్ పాపిలోమ వైరస్ (హెపీవీ), హెపటైటిస్ బి, సీ, హెలికోబక్టర్ పైలోరి వల్ల వచ్చే   వ్యాధులు కేన్సర్‌కు కారణాలుగా ఉన్నాయన్నారు.

 

Monday, 18 April 2016

నాగాలాండ్ లో పెరుగుతున్న కేన్సర్ కేసులు

నాగాలాండ్‌లో ప్రతి ఏటా కొత్తగా 600 కేన్సర్‌ కేసులు నమోదవుతున్నాయి. 2009-2014 మధ్య కాలంలో మొత్తంగా 3338 కేసులు నమోదయ్యాయి. నాగాలాండ్‌ పాపులేషన్‌ బేస్డ్‌ కేన్సర్‌ రిజిస్ట్రీ ప్రధాన దర్యాప్తు అధికారి డా.వి.ఖామో ఈ విషయాన్ని తెలిపారు.

వీరిలో 2034మంది పురుషులుండగా 1314మంది మహిళలు వున్నారు. నాగాలాండ్‌, మణిపూర్‌ల్లో గొంతు కేన్సర్‌ ఎక్కువగా వుంటోంది. తర్వాత స్థానంలో పొట్ట కేన్సర్‌ వుందని ఆమె చెప్పారు. అంతర్జాతీయంగా 2.5కోట్ల కేన్సర్‌ కేసులు నమోదవగా, భారత్‌ 25లక్షల కేసులు నమోదవుతున్నాయని తెలిపారు.

సంతాన చికిత్సలతో రొమ్ము కేన్సర్

సంతానం కలగని దంపతుల కోసం ఐవీఎఫ్‌ సహా పలు చికిత్సలు నేడు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ చికిత్సలతో రొమ్ము కేన్సర్‌ వచ్చే ప్రమాదం పెరుగుతోందని తాజా అధ్యయనంలో తేలింది. స్వీడన్‌లోని కరొలిన్‌స్కా ఇనిస్టిట్యూట్‌ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు.


 సంతానం కోసం చాలా కాలం పాటు ఎదురుచూసిన తర్వాత దంపతులు వైద్యులను ఆశ్రయిస్తారు. ఆధునిక వైద్య పరిజ్ఞానంతో తల్లిదండ్రులుగా మారాలని నిర్ణయించుకోవడం, ఐవీఎఫ్‌ తదితర హార్మోనల్‌ చికిత్స తీసుకోవడం జరుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ సందర్భంగా.. హార్మోనల్‌ చికిత్సతో రొమ్ము కణజాలం ఎదుగుదలపై శరీరం నియంత్రణ కోల్పోతుందన్నారు. ఇది కేన్సర్‌ కణితుల పెరుగుదలకు కారణమవుతుందని చెప్పారు. సాధారణ మహిళలతో పోలిస్తే ఈ కణజాలం పెద్దగా ఉన్నవారిలో రొమ్ము కేన్సర్‌ వచ్చే ప్రమాదం ఆరు రెట్లు ఎక్కువని ఈ పరిశోధనలో పాల్గొన్న ఫ్రిదా లండ్‌బర్గ్‌ వివరించారు.

Sunday, 17 April 2016

కేన్సర్ పై కసి తీర్చుకున్న వృద్ధురాలు

ఎందరో జీవితాలను చిద్రం చేస్తున్న కేన్సర్ మహమ్మారిపై తన కక్ష్యను తీర్చుకునేందుకు మాజీ కేన్సర్ బాధితురాలికి డెట్రాయిట్లోని హెన్రీఫోర్డ్ కేన్సర్ ఆసుపత్రి వినూత్నమైన అవకాశాన్ని కల్పించింది. త్రీడీ పరిజ్ఞానంతో రూపొందించిన కేన్సర్ కణితి నమూనాను అందరి ముందూ సుత్తితో చితక్కొట్టి ఆ వృద్ధురాలు తన కోపాన్ని తీర్చుకునేలా సాయపడింది. మిషిగాన్ ప్రాంతానికి చెందిన షీలా స్కై కాస్సెల్మాన్ అనే 75 ఏళ్ల వృద్ధురాలికి చాలాకాలంగా కేన్సర్ ఉంది. ఆమె క్లోమంలో ఎదిగిన గడ్డ వల్ల ఆమె జీవితం అతలాకుతలమైపోయింది. ఇక చావే శరణ్యం అనుకున్న పరిస్థితిలో వైద్యనిపుణులు ఆమెకు పునర్జీవితాన్ని ప్రసాదించారు.

ప్రస్తుతం కేన్సర్ సోకితే ఇక వారి జీవితాలు అంతమైపోయినట్లేననే ప్రచారం ఉంది. కానీ అది వాస్తవం కాదని కేన్సర్ నిపుణులు ఎప్పటినుండో చెపుతున్నారు. ఇందుకోసం పాశ్చాత్యదేశాల్లో ప్రచార కార్యక్రమాలు చురుకుగా సాగుతుంటాయి. అందులో భాగంగా ''క్రషింగ్ కేన్సర్'' అనే ప్రచార కార్యక్రమాన్ని హెన్రీఫోర్డ్ ఆసుపత్రి ప్రారంభించింది. కేన్సర్ నుండి విముక్తురాలయిన షీలాకు ఆ ప్రచార కార్యక్రమంలో భాగంగా తన కేన్సర్ కణితిని చితకకొట్టి నుజ్జునుజ్జు చేసే అవకాశం దక్కింది. తొలుత ఆమె ఒక బేస్ బాల్ బ్యాట్ తో ఆ కణితిని చితకకొట్టాలని భావించినా ఆ తరువాత మనసు మార్చుకుని సుత్తి ఎంచుకున్నారు. షీలాకు మహిళకు క్లోమసంబందిత కేన్సర్ సోకింది. కేన్సర్ పుణ్యమా అంటూ అప్పట్లో మహిళ పడిన కష్టాలు ఇన్నీ అన్నీ కావు.