Thursday 13 June 2019

రక్తదానం తర్వాత..?


రక్తదానం చేస్తే ఇన్‌ఫెక్షన్లు వస్తాయనేది అపోహ మాత్రమే.. శుభ్రమైన(స్టెరైల్‌) పరికరాలు వాడితే ఇన్‌ఫెక్షన్లు దరిచేరవు.
ఎలాంటి ఆరోగ్య సమస్యలూ తలెత్తవు. రక్తదానం తర్వాత కొన్ని గంటలు విశ్రాంతి తీసుకుంటే చాలు.
ఒకసారి రక్తదానం చేయడానికి గంటకన్నా ఎక్కువ సమయం పట్టదు.
రక్తదానం చేసిన తర్వాత హిమోగ్లోబిన్‌ పడిపోతుందనేది కొందరి అపోహ.
ఒకసారి 400 మి.లీ కంటే తక్కువ తీసుకుంటారు. మన శరీరం దీనిని చాలా త్వరగానే భర్తీ చేసుకుంటుంది.
క్రమం తప్పకుండా రక్తదానం చేసే వారిలో గుండెజబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉందని పలు పరిశోధనల్లో వెల్లడైంది.
ఇక ఎదురుచూపులు మానుకోవాలి…
మనం బతికున్నప్పుడు మన కళ్ళముందు.. మన ద్వారా మరొకరి ప్రాణం కాపాడాము అనే అనుభూతి గురించి మాటల్లో చెప్పలేము.కానీ, చాలామంది తమ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా బాగోలేకపోతే ఎవరు రక్తదానం చేస్తారా? అని ఎదురు చూస్తారే తప్ప మనమే ఎందుకు రక్తదానం చెయ్యకూడదు అని ఆలోచించరు.

మేము ఇవ్వలేము.. మా వల్ల కాదు..అనే ఇటువంటి ఆలోచనా విధానాలు ఇకనైనా మానాలి. మేము కూడా ఇవ్వగలము.. అనే ఆలోచన రావాలి.

మీరు కూడా రక్తదాతలు అవ్వండి..ప్రాణదాతలు కండి..

No comments:

Post a Comment