Friday 27 November 2015

కేన్సర్ కన్నా భయమే ప్రమాదం

మనం శరీరం గురించి ఆలోచించినప్పుడల్లా శారీరక ఆరోగ్యం గురించి మాత్రమే ఆలోచిస్తాం. కానీ మనిషి సంపూర్ణ ఆరోగ్యం శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం మీద కూడా ఆధారపడి ఉంటుంది. మానసికంగా ఎలాంటి సమయంలో అయినా ధైర్యాన్ని కోల్పోకుండా ఉన్నప్పుడే జీవితంలో ఎదురయ్యే సమస్యల ప్రభావం మన ఆరోగ్యంపై పడకుండా చూసుకోగలుగుతాము. మానసికంగా బలహీనుడైన వ్యక్తి చిన్న చిన్న కష్టాలకు కూడా చలించిపోయి రక్తపోటును పెంచుకుని, గుండెజబ్బులు కొని తెచ్చుకుంటాడు.
           
భయపడే స్థాయిలోని తీవ్రత మీరు పిరికివారో, ధైర్యవంతులో తెలియజేస్తుంది. చచ్చేంత పిరికివాడు ఆపద రాకముందే భయపడతాడు. కాస్త ధైర్యం ఉన్నవాడు ఆపద ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు భయపడతాడు. పూర్తిస్థాయి ధైర్యవంతుడు ఆపద గడచిపోయాక భయపడతాడని చెబుతారు. ఆపద అనేది చెప్పి రాదు. అనుకోని సమస్యల నుంచి, అనుకోని సందర్భాల నుంచి ఆపదలు వస్తుంటాయి. మీకు వ్యాధి వచ్చినప్పుడు అధైర్యపడితే అది మరింత పెరుగుతుందే కానీ తగ్గదు. 

No comments:

Post a Comment