Monday, 16 November 2015

కలుషితాహారంతో కాలేయపు క్యాన్సర్

కలుషిత ఆహారం చాలావరకు వ్యాధులకు కారణమని మనందరికీ తెలుసు. ముఖ్యంగా ప్రమాదకరమైన కాలేయపు క్యాన్సర్ కు కూడా కలుషిత ఆహారం ఓ కారణంగా వైద్య నిపుణులు చెబుతున్నారు. కాలేయపు క్యాన్సర్ పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మన దేశంలో ఇధి సాధారణమే అయినా.. ఫారిన్ కంట్రీస్ లో మాత్రం అరుదు. ముఖ్యంగా మద్యపాన ప్రియుల్లో ఎక్కువగా కనిపిస్తుంది.

             కాలేయం చెడిపోవడాన్ని సిర్రోసిస్ అంటారు. సిర్రోసిస్ క్యాన్సర్ కు దారితీస్తుంది. శిలీంధ్రాలు ఆహారాన్ని కలుషితం చేయడం కారణంగా కేన్సర్ వస్తుంది. కేన్సర్ రోగులకు ఆకలి ఉండదు. బలహీనంగా ఉంటారు. కడుపులో విపరీతమైన నొప్పి ఉంటుంది. కుడివైపు భాగమంతా వాపెక్కి నొప్పిగా అనిపిస్తుంది. కాలేయపు కేన్సర్ రోగుల్లో హిమోగ్లోబిన్ పరిమాణం తగ్గి ఎర్రరక్తకణాలు తక్కువవుతాయి. బయోప్సీ ద్వారా రోగాన్ని నిర్థారిస్తారు. తొలిదశలో శస్త్రచికిత్సతో ఉపయోగం ఉంటుంది. ముదిరితే ఆపరేషన్ చేసినా ఫలితం ఉండదు. 

No comments:

Post a Comment