కేన్సర్ అనేది ప్రాణాంతకమైన వ్యాధి. కేన్సర్ లక్షణాల ఆధారంగా ప్రాథమిక స్థాయిలోనే గుర్తిస్తే చికిత్స సులభం అవుతుంది. కేన్సర్ ముదిరేకొద్దీ చికిత్స క్లిష్టంగా మారడంతో పాటు ప్రాణాలే బలిగొనే పరిస్థితి రావచ్చు. కాబట్టి అందరూ కేన్సర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కేన్సర్ లక్షణాలేంటో తెలుసుకుని అవి కనిపించగానే డాక్టర్ని సంప్రదిస్తే సమస్య పరిష్కారం అవుతుందని చెబుతున్నారు.
శరీరంలో కణతలు పెరిగి పెద్దవైనా, పుట్టుమచ్చలు రంగు మారి పెద్దగా అయినా, శరీరంలో ఏ భాగం నుంచైనా రక్తంఅధికంగా కారుతున్నా, తీరచు దగ్గు వస్తున్నా, గొంతు బొంగురుపోయినా, మహిళల్లో అధికంగా తెలుపు కనిపించినా, దృష్టిదోషాలు, కంటినొప్పులు, పిల్లల్లో జ్వరం తరచూ రావడం, సకాలంలో బహిష్టులు కాలేకపోవడం, రోజుల తరబడి అజీర్ణం, మలమూత్ర వ్యవస్థలో మార్పులు.. ఇవన్నీ కేన్సర్ కు సంకేతాలు. ఈ లక్షణాలున్న ప్రతివారికీ కేన్సర్ ఉండాలన్న రూలేమీ లేకపోయినా.. ముందు జాగ్రత్తగా పరీక్ష చేయించుకోవడం ఉత్తమం.

No comments:
Post a Comment