Tuesday, 29 November 2016

ఎక్కువ మందితో సెక్స్ చేస్తే డేంజ‌ర్‌


మాన‌వ‌జీవితంలో సెక్స్‌కు ఎంతో ప్రాముఖ్య‌త ఉంది.జీవితంలో డ‌బ్బు ఎంత ఉన్నా శృంగారంలో సంతృప్తి లేక‌పోతే జీవితం ఆనంద‌మ‌యం కాదు. అయితే సెక్స్ గురించి కొన్ని డేంజ‌ర్ విష‌యాలు తాజా సర్వేలో వెల్ల‌డ‌య్యాయి. ఒక‌రి కంటే ఎక్కువ మందితో సెక్స్‌లో త‌ర‌చూ పాల్గొంటూ ఉండేవారికి ముప్పు త‌ప్ప‌ద‌ట‌.లైంగిక భాగస్వాముల సంఖ్య ఎక్కువ ఉన్న పురుషులకు ప్రోస్టేట్‌ కేన్సర్‌ ముప్పూ ఎక్కువేనని  వెల్ల‌డైంది.


        జీవిత కాలంలో ఏడుగురికంటే ఎక్కువ మందితో లైంగిక అనుబంధం ఉన్నా.. 17 ఏళ్లకన్నా ముందే లైంగిక చర్యలో పాల్గొన్నా మిగతా వారితో పోలిస్తే ప్రోస్టేట్‌ కేన్సర్‌ ముప్పు పెరుగుతుందట‌.ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్‌ శాస్త్రవేత్తల బృందం జ‌రిపిన సర్వేలో ఈ షాకింగ్ మ్యాట‌ర్ తేలింది. ఈ బృందంలో భారత సంతతి పరిశోధకుడు కూడా ఉన్నారు. పదివేల మందిని పరీక్షించగా.. లైంగిక చర్యకు ప్రోస్టేట్‌ కేన్సర్‌కు మధ్య సంబంధం ఉన్నట్టు తేలిందని

క్యాన్సర్ వ్యాధికి కూడా లింగ వివక్ష

క్యాన్సర్ వ్యాధికి కూడా లింగ వివక్ష ఉన్నట్లుంది. కాకపోతే పురుషులపై కాస్త మమకారం ఎక్కువేమో. ప్రపంచవ్యాప్తంగా 74 లక్షల మంది పురుషులకు క్యాన్సర్ వ్యాధిరాగా, 66 లక్షల మంది మహిళలు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. మహిళలకన్నా పురుషులకు ఎక్కువగా ఈ వ్యాధి రావడానికి కారణం ఆహారపు అలవాట్లతోపాటు ధూమ పానం, మద్యపానం కారణమని పరిశోధకులు తెలియజేస్తున్నారు. ఆశ్చర్యకరంగా బాలికలకన్నా కూడా క్యాన్సర్ వచ్చిన బాలలే ఎక్కువగా ఉన్నారు. అందుకు కారణం మాత్రం ధూమపానం, మద్యపానం కాదట. ఎందుకంటే వారికి ఈ అలవాట్లు ఉండవు కనుక.


          పురుషుల్లో ఎక్కువ కాలేయం, వీర్యగ్రంధి, పురీష నాళ క్యాన్సర్లు వస్తుండగా, మహిళల్లో ఎక్కువగా బ్రెస్ట్, కాలేయం, పురీషనాళ క్యాన్సర్లు వస్తున్నాయి. క్యాన్సర్ వచ్చిన పిల్లలు జీవించే కాలం అభివృద్ధి చెందిన అధికాదాయ దేశాల్లో 80 శాతం పెరిగిందని వైద్య పరిశోధకులు తెలియజేశారు. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో క్యాన్సర్ బారిన పడిన పిల్లలు కనీసం ఐదేళ్లు జీవిస్తుండగా, పేద దేశాల్లో ఎక్కువ కాలం బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వారంటున్నారు. లైంగిక క్రోమోజోములు అభివృద్ధి చెందేవరకు పిల్లల్లో ఆడైనా, మగైనా క్యాన్సర్ బారిన పడే అవకాశాలు సమానంగా ఉన్నాయని వారు చెప్పారు.

Monday, 28 November 2016

గోదారి నీళ్లతో కేన్సర్ గ్యారెంటీ


ఒకచోట మంద్రంగా, గంభీరంగా.. ఒకచోట ఉరుకుల పరుగులతో.. పచ్చటి ప్రకృతి గుండా సాగిపోయే వేదమంటి గోదావరి.. క్రమంగా కాలుష్య కాసారంగా మారిపోతోంది. గోదావరి కాలుష్యంలో 18 శాతం మాత్రమే పరిశ్రమల వల్ల వస్తోంది. మిగిలినదంతా ప్రజలు వదిలే వ్యర్థాలు, వ్యవసాయానికి ఉపయోగించే ఎరువుల వల్ల జరుగుతోంది.
ఈ ముప్పు నుంచి ప్రజలను కాపాడాలంటే.. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలతో మొత్తం గోదావరి పరీవాహక ప్రాంతాన్ని సర్వే చేయించాలి. మానవ రహిత విమానాలు, రిమోట్‌ సెన్సింగ్‌ టెక్నాలజీలు, వెబ్‌ సెన్సర్‌ బేస్డ్‌ టెక్నాలజీల వల్ల ప్రయోజనం ఉంటుంది.
        
 పచ్చటి పంటలతో అలరారే గోదావరి పరీవాహక ప్రాంతానికి పెనుముప్పు ముంచుకొస్తోంది. స్వచ్ఛమైన జలాలతో ఉరుకుల పరుగులిడే గోదారి తల్లి కాలుష్యకాసారంగా మారిపోతోంద. కాలకూట విషాల్లాంటి పారిశ్రామిక వ్యర్థాలు.. నిండు ప్రాణాలకు మరణశాసనం రాసే ఎరువులు, పురుగుమందుల అవశేషాలు.. ఆ జీవనదిని ప్రాణాలు తీసే విషమయ కాళింది మడుగులా మార్చేస్తున్నాయి. ఫలితం.. పంట దిగుబడులు తగ్గిపోతున్నాయి. కేన్సర్లు పెరిగిపోతున్నాయి.

Saturday, 26 November 2016

ముందే గుర్తిస్తే కేన్సర్ తో నో ప్రాబ్లమ్


బోన్ కేన్సర్లు అంటే అవి కేవలం ఎముకల్లో పుట్టేవి మాత్రమే కాదు. కొన్ని సార్లు ఇతర భాగాల్లో ఉన్న కేన్సర్లు కూడా ఎముకలకు పాకవచ్చు. అలాగే ఎముకల్లో పుట్టిన కేన్సర్ ఇతర భాగాలకూ పాకవచ్చు . అయితే ఈ కేన్సర్లు అన్నింటికీ చాలా వేగంగా వ్యాపించే లక్షణం ఒక టుంది. అందుకే ఈ కేన్సర్లను ఎంత తొందరగా గుర్తించి చికిత్స తీసుకుంటే అంత ప్రయోజనం. ఎప్పుడైనా పిల్లలు ఎక్కువ రోజులు కుంటుతూ నడుస్తూ ఉంటే, ఏదోలే అనుకుంటే ఒక్కోసారి ప్రమాదం ముంచుకు రావచ్చు.అప్పుడెప్పుడో దెబ్బ తగిలిన తాలూకు నొప్పే అనుకుంటే అది ఆ తరువాత బాగా ముదిరిపోయిన బోన్ కేన్సర్ కావచ్చు అందుకే ఈ విషయమై ఎంత తొందరగా డాక్టర్‌ను సంప్రదిస్తే, అంత శ్రేయస్కరం.



              ఎముకల్లో రెండు రకాల కేన్సర్ కణుతులు వస్తూ ఉంటాయి. వీటిని ప్రైమరీ, సెకండరీ బోన్ కేన్సర్స్ అంటూ ఉంటాం. ఎముకల్లో పుట్టేవి ఒక రకమైతే, శరీరంలోని ఇతర భాగాల్లో పుట్టి ఎముకల్లోకి పాకేవి రెండో రకం. అయితే ఎముకల్లో పుట్టే కేన్సర్ కణుతులు తక్కువే కాని. బయట ఎక్కడో పుట్టి, ఎముకల్లోకి విస్తరించేవే ఎక్కువ. నిజానికి అన్ని రకాల కేన్సర్లూ ఎముకలకు పాకవచ్చు.అయితే కొన్నిరకాల కేన్సర్లు ప్రత్యేకించి, ప్రొస్టేట్ కేన్సర్ చాలా వేగంగా పాకుతుంది. అందుకే ప్రొస్టేట్ కేన్సర్ ఉన్నట్లు తేలిన వారికి వెంటనే బోన్ స్కాన్ చేయించడం తప్పనిసరి అవుతుంది. అలాగే కిడ్నీ కేన్సర్, లంగ్ కేన్సర్, థైరాయిడ్ కేన్సర్, రొమ్ముకేన్సర్‌లు కూడా ఎముక లకు పాకే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ కారణంగానే రొమ్ము కేన్సర్‌కు వైద్యచికిత్సలు తీసుకున్న తరువాత కూడా ప్రతి ఏటా బోన్‌స్కాన్ సూచిస్తారు..

Friday, 25 November 2016

లంగ్ కేన్సర్ యమ డేంజర్

 శ్వాసకోశాల కేన్సర్‌ నిర్ధారణ చాలా  క్లిష్టమైనది. ఈ  కేన్సర్‌ లక్షణాలు, క్షయ వ్యాధి లక్షణాలు దాదాపు ఒకేలా ఉండడం వల్ల, శ్వాసకోశ  కేన్సర్‌ను  క్షయవ్యాధిగా పొరబడే ప్రమాదం ఉంది. అందుకే క్షయ వ్యాధి మందులతోనే చాలా కాలం గడిపేయవచ్చు.  పైగా శ్వాసకోశ వ్యాధికి చాలా వేగంగా పెరిగే లక్షణం ఉంది.  అందుకే ఆలస్యమయ్యే కొద్దీ నాటికి  వ్యాధి బాగా ముదిరిపోవచ్చు. మొదట్లో  సాధారణ వైద్యచికిత్సలేవో తీసుకున్నా, లక్షణాలు తగ్గకపోవడం, తగ్గినా మళ్లీ మళ్లీ అవే లక్షణాలు  కనిపించినప్పుడు,  అది శ్వాసకోశ  కేన్సరేమోనని అనుమానించి  వెంటనే కేన్సర్‌  వైద్య నిపుణులను సంప్రదించాలి.



                   కొన్ని రకాల కేన్సర్‌ కణాలు  కొంత నిదానంగానే పెరుగుతూ వెళతాయి. మరికొన్ని చాలా వేగంగా విస్తరిస్తూ వెళతాయి. శ్వాసకోశాల్లో మొదలయ్యే కేన్సర్‌ కణాలకు కూడా చాలా వేగంగా పెరిగే లక్షణమూ ఇతర భాగాలకు పాకే తత్వమూ ఎక్కువ. శ్వాసకోశాల్లో మొదలయ్యే కేన్సర్లను ప్రైమరీ  లంగ్‌ కేన్సర్లనీ, కార్సినోమా కేన్సర్లనీ పిలుస్తారు. శ్వాసకోశ కేన్సర్‌ బారిన పడిన దాదాపు 85 శాతం మందిలో పొగ  తాగడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మిగతా 15 శాతం జన్యుపరమైన కారణాలతో పాటు  వాతావరణ కాలుష్యాలు కూడా కొంత కారణమవుతున్నాయి.

Thursday, 24 November 2016

రాష్ట్రాన్ని కబళిస్తున్న కేన్సర్

తినే తిండి కల్తీ! పీల్చే గాలి కల్తీ! తాగే నీరు కూడా కల్తీ! వీటితోపాటు అనారోగ్యకరమైన జీవనశైలి! కారణమేదైనా గానీ.. తెలంగాణ రాష్ట్రంలో కేన్సర్‌ రోగుల సంఖ్య క్రమేపీ పెరుగుతుందన్నది మాత్రం చేదునిజం! ఆరోగ్యశ్రీ పథకంలో కేన్సర్‌ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో పాటు ప్రభుత్వం  నిర్వహించిన బ్రెస్ట్‌కేన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్ష ల్లోనూ కేన్సర్‌ రోగులు పెరుగుతున్నట్లు తేలుతోంది. మరోవైపు కేన్సర్‌ చికిత్సల వల్ల ప్రజలపైనే కాకుండా ప్రభుత్వంపై కూడా ఆర్థికంగా భారం అధికం అవుతోంది. ఇప్పటిదాకా వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే.. రాష్ట్రంలో కేన్సర్‌ వ్యాధి ఆందోళన కలిగించేలా విస్తరిస్తోందని తెలుస్తోంది.




                  ప్రభుత్వం  మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జడ్చర్ల, గంగాపూర్‌, వరంగల్‌ జిల్లా రాయపర్తి, మహబూబాబాద్‌లలో మహిళల కోసం బ్రెస్ట్‌ కేన్సర్‌ మొబైల్‌ స్క్రీనింగ్‌ కేంద్రాలను నిర్వహించింది. రెండు రోజుల్లో 1,271 మంది మహిళలకు పరీక్షలు చేశారు. వీరిలో 273 మందికి కేన్సర్‌ ఉన్నట్లు అనుమానం కలగడంతో మమ్మోగ్రామ్‌ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 135 మందికి కేన్సర్‌ ఉందని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. వీరికి మరిన్ని పరీక్షల కోసం శాంపిళ్లను సేకరించి బయాప్సీ కోసం పంపించారు. 

Wednesday, 23 November 2016

పండులో ఆరోగ్యం

మనం తీసుకునే ఆహారంతో పాటు .. పండ్లను కూడా తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. పండ్లలో అనేక రకాలై పోషకపదార్థాలు ఉంటాయి. అలాగే రోజూ  పండ్లు తినివారిలో  వ్యాధి నిరోధక శక్తి  అధికంగా  ఉంటుంది. వివిధ రకాలైన  పండ్లు రోజూ  తీసుకోవడం వల్ల .. కొన్ని రకాలైన వ్యాధులు రాకుండా ముందే నిరోధించవచ్చని వైద్యులు చెబుతున్నారు. మన గుండెను భద్రంగా  చూసుకోవాలంటే .. పాలి పినాల్స్ ఎక్కువగా ఉండే  ఫ్రూ ట్స్ తినాలి .
           

క్యాన్సర్  మహమ్మరి… ఎవరిని ఏరకంగా చుట్టుముడుతుందో అస్సలు చెప్పలేం.  చాలా మంది రకరకాల క్యాన్సర్ల బారిన పడుతూ ఉంటారు. అలాంటి కేన్సర్ మన దరికి చేరకుండా చూడాలంటే .. పండ్ల ప్రత్యామ్నాయం . లిచీ ఫ్రూట్ రెగ్యులర్ గా తింటూ ఉంటే … బ్రెస్ట్ కేన్సర్ ను దూరంగా పెట్టొచ్చు.  లిచీలో  యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అవి కేన్సర్ కారకాలను అరికడతాయని వైద్యులు చెబుతున్నారు. ఇక బొప్పాయి లాంటి  పండ్లలో  బీటా క్రిపోక్సాంథిన్  ఎక్కువగా ఉంటుంది. ఇది లంగ్ కేన్సర్ నుంచి రక్షిస్తుంది.