లడ్ కేన్సర్ బాధితులకు గుడ్ న్యూస్. వ్యాధితో బాధ పడుతున్న వారికి మెరుగైన చికిత్సను అందించేందుకు ఓ కొత్త మెడిసిన్ ను సైంటిస్టులు తయారు చేశారు. ఈ మందును విడిగా వాడినా.. కిమోథెరపీతో పాటు అందించినా మంచి ప్రభావం చూపిస్తున్నట్లు క్లినికల్ ట్రయల్స్ లో స్పష్టమైంది. ఈ డ్రగ్ ను అభివృద్ధి చేసిన టీంకు భారత సంతతి పరిశోధకురాలు,యూనివర్శిటీ ఆఫ్ యూటా పోస్ట్ డాక్టొరల్ శ్రీవిద్య భాస్కర నేతృత్వం వహించారు. అక్యూట్ లింపోబ్లాస్టిక్ లుకేమియా(ALL) గా వ్యవహరించే బ్లడ్ కేన్సర్ చిన్నా పెద్దా తేడాలేకుండా అందరిపైనా దాడిచేస్తుంది.
దీని బాధితుల్లోని 30% మందిలో ఫిలడెల్ఫియా క్రోమోజోమ్ ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. క్రోమోజోమ్ లోని రెండు విభాగాలు వాటి స్వభావానికి భిన్నంగా అతుక్కుపోతే దాన్ని ఫిలడెల్పియా క్రోమోజోమ్ గా వ్యవహరిస్తారు. కొత్తగా ఏర్పడిన ఈ క్రోమోజోమ్ DNA ను మరమ్మతు చేయడం ప్రారంభిస్తుంది. DNA రిపేర్ అంటే వినడానికి ఏదేదో మంచి విషయంలాగానే అనిపించవచ్చు. కానీఈ క్రమోజోమో చే మరమ్మతు ఫలితం చెడుకే దారి తీస్తుంది. ఆ ప్రక్రియ వ్యసనంగా మారి నిరంతరం కొనసాతుంది. ఈ ప ర్రక్రియ కోసం ఆక్రోమోజోమ్ వినియోగించే రకరకాల ప్రోటీన్లను అడ్డుకోడానికి పలు రకాల మందలను వాడాలి. అలా వాడితే అవి విషపూరితంగా మారి సాధారణ కణాలపై దుష్ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అందుకే ఈ వ్యసనాన్ని నిరోధించేందుకు విస్తృతంగా ప్రయోగాలు చేసి హిస్టోన్ డియాసిటైలసిస్ అనే రెండు ప్రొటీన్లపై ప్రధానంగా దృష్టి సారించి సరికొత్త మెడిసిన్ ను ఆవిష్కరించినట్లు పరిశోధకులు తెలిపారు.

No comments:
Post a Comment