పసుపులో ఔషధ గుణాలున్నాయని మన పూర్వీకులు ఏనాడో చెప్పారు. ఇప్పుడు దీనికున్న మరో అద్భుతమైన గుణాన్ని శాస్త్రవేత్తలు పరిశోధించి కనుగొన్నారు. యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసే పసుపు కేన్సర్ నిరోధించడానికీ సాయపడుతుందని అమెరికా శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. ఈ బృందంలో భారత సంతతి శాస్త్రవేత్త కూడా ఉండడం విశేషం. పసుపులో ఉండే కర్కమిన్ సాయంతో పసికందులలో వచ్చే కేన్సర్‌ను సమర్థమంతంగా నిరోధించవచ్చట.
కాగా, పదేళ్లలోపు చిన్నారులకు ఈ కేన్సర్ ముప్పు ఎక్కువ. ఇందులో కణుతులు మందులకు లొంగవని నిపుణులు చెబుతున్నారు. ఈ తరహా మొండి కణుతులే లక్ష్యంగా సూక్ష్మ అణువులను పంపించేందుకు కర్కమిన్ తోడ్పడుతుందన్నారు. కణితిని అణిచివేసే సూక్ష్మ అణువులను కర్కమిన్‌కు జతచేసి నేరుగా లక్ష్యానికి చేర్చవచ్చన్నారు. ఇలా ఓ ప్రత్యేక పద్ధతిలో దాడి చేసి కేన్సర్‌ను నియంత్రించవచ్చని చెప్పారు. ఈ విషయంపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు.

No comments:
Post a Comment