Friday, 4 August 2017

బోన్ కేన్సర్ వ్యాధి విద్యార్థి సీబీఎస్ఈ పరీక్షల్లో టాపర్

అతడి పట్టుదల ముందు భయంకరమైన కేన్సర్ వ్యాధి తలవంచింది ప్రాణాంతకమైన కేన్సర్‌తో పోరాటం చేస్తూ ఓ పందొమ్మిదేళ్ల విద్యార్థి ప్లస్‌ 2లో 95 శాతం మార్కులు సాధించాడు. ఇటీవలే ప్రకటించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ ప్లస్ 2 ఫలితాల్లో రాంచీకి చెందిన తుషార్ రిషి 95 శాతం మార్కులు సాధించి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. ప్రతి మూడు నెలలకు ఒకసారి కేన్సర్ వ్యాధికి చికిత్స కోసం న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌‌కు వెళ్తూ ఎలాంటి శిక్షణ లేకుండానే ఇంగ్లిష్‌లో 95, ఫిజిక్స్‌లో 95, మ్యాథ్‌మెటిక్స్‌లో 93, కంప్యూటర్స్‌లో 89, ఫైన్ఆర్ట్స్‌లో 100 మార్కులు సాధించాడు.








2014లో కేన్సర్ బారిన పడిన తుషార్ రిషి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాయలేకపోయాడు. పరీక్షలకు ముందే బోన్ కేన్సర్ సోకినట్లు నిర్ధరణ కావడంతో 11 నెలల పాటు కిమోథెరపీ చేయించుకున్నాడు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న తుషార్ 2015లో పదో తరగతి పరీక్షలకు హాజరై 10కి పది పాయింట్లు సాధించాడు. సైన్స్ విద్యార్థి అయిన రిషి ఇంజినీరింగ్ కోర్సు కాకుండా ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లిష్ లేదా ఎకనమిక్స్‌ డిగ్రీ చేస్తానని పేర్కొన్నాడు.

No comments:

Post a Comment