Thursday, 3 August 2017

పెద్దపేగుకు క్యాన్సర్ వస్తే..

పెద్దపేగు, మలద్వారాలకు వచ్చే కేన్సర్‌ను కోలోరెక్టల్, కోలన్ కేన్సర్ అని అంటారు. ఈ వ్యాధిలో పెద్దపేగు, మలద్వారం, అపెండిక్స్ భాగాల్లో కేన్సర్ కంతులు ఏర్పడి క్రమంగా పెరుగుతూ వుంటాయి. కేన్సర్ వ్యాధుల్లో దీనిని మూడవ అతి పెద్ద కేన్సర్‌గా చెపుతారు. కేన్సర్ వల్ల వచ్చే మరణాలకు ఇది రెండవ అతి పెద్ద కారణం. ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా 6,55,000 మంది కోలన్ కేన్సర్‌వల్ల మృత్యువు బారిన పడుతున్నారని ఎన్నో సర్వేలు తెలియజేస్తున్నాయి. ఈ మధ్య ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.



     

పెద్దపేగులో పెరిగి- కేన్సర్ కాని కంతులైన అడినోమాటస్ పాలిప్స్ నుంచి ఈ కేన్సర్ కంతులు ఉద్భవిస్తాయని భావిస్తున్నారు. కుక్కగొడుగులలాగా ఉండే ఈ అడినోమాటస్ పాలిప్స్.. మామూలుగా బినైన్ కంతులే అయి ఉంటాయి. కాని వాటిలోని కొన్ని మాత్రం తర్వాత కాలంలో కేన్సర్లుగా పరిణామం చెందుతాయి. పెద్దపేగులో వచ్చే కేన్సర్లను కొలనోస్కోపీ పరీక్ష ద్వారా నిర్థారించడం జరుగుతుంది.

No comments:

Post a Comment