Saturday, 5 August 2017

బ్రెడ్డుతో కేన్సర్ ఖాయమా..?

సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ (సీఎస్ఈ) అనేది విశ్వసనీయ సంస్థ. ఈ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో బ్రెడ్, బర్గర్, పిజ్జాలలో పొటాషియం బ్రోమేట్, పొటాషియం అయోడేట్ ఉన్నట్టు తెలిసింది. మార్కెట్లో ఉన్న 38 ప్రముఖ బ్రాండ్ల బ్రెడ్లు, బన్ లు, బర్గర్, పిజ్జాల శాంపిల్స్ ను సేకరించి తన పరిధిలోని ల్యాబ్ లోను, మూడో పక్షానికి చెందిన ల్యాబ్ లలోను పరీక్షింపజేసింది. వీటిలో 84 శాతం శాంపిల్స్ లలో ఈ ప్రమాదకర రసాయనాలు ఉన్నాయని సీఎస్ఈ వెల్లడించింది.






దేశీయ తయారీదారులు బ్రెడ్ తయారీలో ఈ రసాయనాలను వినియోగిస్తున్నట్టు తెలిపింది. పొటాషియం బ్రోమేట్ కేటగిరీ 2బి కార్సినోజెన్... అంటే ఇది కేన్సర్ కు దారితీయగలదు. థైరాయిడ్ కేన్సర్, మూత్రపిండాలు, ఉదర సంబంధ కేన్సర్లకు కూడా కారణమవుతుంది. పొటాషియం అయోడేట్ రసాయనం థైరాయిడ్ సమస్యకు దారితీస్తుంది. వీటితో ఆరోగ్యానికి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకున్న సీఎస్ఈ తక్షణమే వీటిని నిషేధించాలని దేశీయ ఆహార భద్రత, ప్రమాణాల సంస్థను కోరింది.

No comments:

Post a Comment