Sunday 7 August 2016

గ్లాసు బీరుతో కేన్సర్ ఖాయం

ప్రతిరోజూ ఒక గ్లాసు బీరు లేదా వైన్‌ తాగితే.. అన్నవాహిక కేన్సర్‌ వచ్చే ప్రమాదం పెరుగుతుందట. అలాగే స్థూలకాయం వల్ల కూడా భారతీయులకు కేన్సర్‌ ముప్పు ఎక్కువగా ఉందట. శారీరక శ్రమలేని జీవనశైలి, స్థూలకాయం, పెరుగుతున్న మద్యపానం అలవాటు కారణంగా భారతీయుల ఆరోగ్యం దెబ్బతింటోందని బెంగళూరుకు చెందిన బేరియాట్రిక్‌, గ్యాసో్ట్రఎంటరాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా 2007 నుంచి 31 వేల మంది కేన్సర్‌ రోగులపై జరిగిన 46 పరిశోధనలను విశ్లేషించిన వీరు.. ముఖ్యంగా ఊబకాయం, ఆల్కహాల్‌ వల్లే.. అన్నవాహిక, క్లోమ, పురీషనాళ, ఛాతీ, కిడ్నీ, థైరాయిడ్‌ వంటి భాగాలకు కేన్సర్‌ వచ్చే అవకాశం ఉందని గుర్తించారు.





                 రోజుకు 10 గ్రాముల ఆల్కహాల్‌ తీసుకునేవారికి కేన్సర్‌ ముప్పు 25 శాతం పెరిగినట్లు వీరు వెల్లడించారు. ఆరోగ్యకర జీవనశైలి, పండ్లు, శాకాహారం తీసుకోవడం, వ్యాయామం ద్వారానే కేన్సర్‌ నుంచి రక్షణ పొందవచ్చని సూచించారు. ఆల్కహాల్ తో కేన్సరే కాదు చాలా రోగాలు వస్తాయని నిపుణులు చెప్పడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా చాలా అధ్యయనాలు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. 

No comments:

Post a Comment