Friday, 5 August 2016

అమ్మో కేన్సర్

కేన్సర్ మహమ్మారి రోజురోజుకీ విజృంభిస్తోంది. కేన్సర్ నివారణ పద్ధతులపై ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నా.. కేన్సర్ రోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దేశంలో కేన్సర్‌తో మరణించే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా కేన్సర్ మరణాల్లో 34% మంది రొమ్ము, గర్భాశయ, నోటి క్యాన్సర్ల కారణంగానే సంభవిస్తున్నాయి. కేన్సర్‌తో మరణించే మహిళల్లో 26.4% మంది రొమ్ము, గర్భాశయ కేన్సర్ల కారణంగానే చనిపోతున్నారని కేంద్ర ప్రభుత్వం ఒక నివేదికలో వెల్లడించింది. ఈ మేరకు దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు ఓ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి.. రాష్ట్రాలకు పంపించింది.


దీర్ఘకాలిక వ్యాధుల్లో ప్రధానంగా కేన్సర్, గుండె జబ్బులు,  మధుమేహం, హైబీపీ, వంటివి ఉన్నాయి. 2012లో దేశవ్యాప్తంగా 1.45 లక్షల మంది మహిళలు రొమ్ము కేన్సర్ బారినపడగా.. వారిలో 70,218 మంది చనిపోయారు. అలాగే ఏటా సగటున సుమారు 1.23 లక్షల మంది మహిళలు గర్భాశయ కేన్సర్ బారిన పడుతుండగా.. అందులో 67,500 మంది మరణిస్తున్నారు. 

No comments:

Post a Comment