Sunday 14 August 2016

వక్కపొడితో కేన్సర్ డేంజర్



వివాహాలు, శుభకార్యాలప్పుడు వక్కపొడి ఇవ్వడం మనకు తెలుసు. కానీ ఆ వక్కపొడి కేన్సర్ కు కారకంగా మారుతుందని తాజా పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. ఆ ఒక్కటే కాదు అనేక రకాల వ్యాధులకు కారణమవుతున్నాయట. పాన్‌లో ఉప‌యోగించే త‌మ‌ల‌పాకు, యాల‌కులు, దాల్చిన చెక్క వరకు సరే. మిగ‌తా ప‌దార్థాల‌న్నీ ప్రాణాంత‌క క్యాన్స‌ర్‌ల‌ను కలుగజేస్తున్నాయని ది ఇంట‌ర్నేష‌న‌ల్ ఏజెన్సీ ఫ‌ర్ రీసెర్చ్ సంస్థ‌  ప‌రిశోధ‌కులు తేల్చారు. ఈ విష‌యాన్ని ప్ర‌యోగాత్మ‌కంగా ధృవీక‌రించారు. కేన్సర్ లను క‌లిగించే ప‌దార్థాల‌న్నింటిలో వ‌క్క ప‌లుకులు ప్ర‌థ‌మ స్థానంలో ఉందని చెబుతున్నారు వాళ్లు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వ‌క్క‌పొడి తిన‌డం వ‌ల్ల కేన్సర్ వచ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయని చెప్పింది.



అదే పనిగా వక్క నమలం వల్ల నోరు, అన్న వాహిక‌ల‌కు చెందిన క్యాన్స‌ర్లు వ‌స్తాయ‌ని తేలింది. వ‌క్క‌పొడి ఎక్కువ‌గా తింటే స‌బ్ మ్యూక‌స్ ఫైబ్రోసిస్ అధికంగా ఉత్ప‌త్తి చెందుతుంది. అది ద‌వ‌డ క‌ద‌లిక‌ల్లో అంత‌రాయం కలిగిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ద‌వ‌డ‌లు పూర్తిగా బిగుసుకుపోయి ఏమీ తిన‌డానికి, తాగ‌డానికి వీలు పడదట. నోటికి రంధ్రాలు ప‌డి తిన్న‌దంతా బ‌య‌టికి వ‌స్తుంద‌ని చెబుతున్నారు. అలాంటి ప్ర‌మాద‌క‌ర నోటి క్యాన్స‌ర్ వ‌చ్చేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌. వ‌క్క ప‌లుకులను ఎక్కువ‌గా తింటే దంతాలు, చిగుళ్లు రంగు మారుతాయి. వాటికి అల్స‌ర్లు వ‌స్తాయి. వ‌క్క ప‌లుకుల‌ను తినే స‌మ‌యంలో జీర్ణాశ‌యంలోకి అది వెళితే స‌మస్య‌లు వస్తాయి. గుండె జ‌బ్బులు వ‌చ్చే వీలు ఉందని వారు చెబుతున్నారు. 

No comments:

Post a Comment