Thursday, 4 August 2016

బ్రెస్ట్ కేన్సర్ నివారణకు చిట్కాలు

స్థూలకాయం ఉన్నట్లయితే మెనోపాజ్‌ తరువాత బ్రెస్ట్‌కేన్సర్‌ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. బాడీమా్‌స్ ఇండెక్స్‌  25 లోపల ఉండేలా చూసుకోవాలి. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్‌, ఫ్యాటీ ఫుడ్స్‌ తక్కువగా తీసుకోవాలి. ధాన్యాలు ఎక్కువగా తినాలి. ప్రతిరోజు అరగంటపాటు వ్యాయామం చేయాలి. ఫిజికల్‌గా యాక్టివ్‌ ఉన్న వారిలో బ్రెస్ట్‌ కేన్సర్‌ రిస్క్‌ 30 శాతం వరకు తగ్గిపోతుంది. హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరఫీ వల్ల బ్రెస్ట్‌ కేన్సర్‌ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ తప్పనిసరిగా హార్మోన్‌ థెరపీ తీసుకోవాల్సి వస్తే ప్రొజెస్టిరాన్‌ ఉన్న మందులను తీసుకోకూడదు. తీసుకోవాల్సి వచ్చినా ఎక్కువ కాలం వాడకూడదు.
         

         బయోఐడెంటికల్‌ హార్మోన్స్‌, హార్మోనల్‌ క్రీమ్స్‌, జెల్స్‌కు దూరంగా ఉండాలి. ఒక ఏడాది పాటు పిల్లలకు పాలిచ్చే తల్లులకు బ్రెస్ట్‌ కేన్సర్‌ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి వీలైనంత వరకు బ్రెస్ట్‌ఫీడింగ్‌ను కొనసాగించాలి. కుటుంబసభ్యుల్లో బ్రెస్ట్‌కేన్సర్‌ వచ్చిన చరిత్ర ఉన్న మహిళలు, అరవై ఏళ్లు పైబడిన వారు ఈస్ర్టోజన్‌ బ్లాకింగ్‌ డ్రగ్స్‌ ఉపయోగించే ముందులు వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి.

Wednesday, 3 August 2016

పసుపుతో కేన్సర్ కు చెక్

ప్రాణాంతక సమస్యల్లో పెద్దపేగు కేన్సర్ ఒకటి. ఇటీవల ఇలాంటి కేన్సర్ కేసులు పెరగటం ఏంతో ఆందోళన కలిగిస్తోన్న అంశం. తగిన జాగ్రత్తలు తీసుకొంటే ఈ సమస్యను నివారించటం సాధ్యమే. తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమైన తర్వాత మిగిలిన వ్యర్ధాలు మలంగా మారతాయి. దీనిని బయటికి పంపటమే పెద్దపేగు పని. పెద్దపేగు)కు సోకిన కేన్సర్ ను కొలన్ కేన్సర్ అనీ, పెద్దపేగు చివరి భాగమైన పాయువుకు సోకితే రెక్టల్ కేన్సర్ అంటారు. పసుపుకు పెద్ద పేగు కేన్సర్‌ను నివారించే శక్తి ఉందని సెయింట్ లూయిస్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.



        పసుపు దుంపలను సిలిమారిన్ తో కలిపి ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుందన్నారు. కాలేయ వ్యాధి నివారణకు సంబంధించి ఈ మిల్క్ తిస్టిల్ ఎక్కువ ఉపయోగిస్తుంటారు. అయితే ఈ పరిశోధన ఇంకా కొనసాగుతోంది. త్వరలో అన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.  పెద్ద పేగుకు కేన్సర్ సోకినప్పుడు పేగు బిగుసుకు పోవటం, పేగులోపల తిత్తులు(పాలిప్స్) ఏర్పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో ఈ లక్షణాలు అసలు కనిపించక పోవచ్చు. పెద్దపేగు కేన్సర్ వంశపారంపర్యంగా వస్తుందని చెప్పే ఖచ్చితమైన ఆధారాలు లేకపోయినా రాదని మాత్రం గ్యారెంటీ లేదు. అందుకే పెద్దలకు ఈ సమస్య ఉన్నప్పుడు ముందు జాగ్రత్తగా 15 ఏళ్ళు నిండిన వారి పిల్లలకు ఏడాదికి ఒకసారి ఈ పరీక్షలు చేయించటం అవసరం. 

బ్రెస్ట్ కేన్సర్‌ లక్షణాలు

స్త్రీల పాలిట మహమ్మారి బ్రెస్ట్ కేన్సర్‌ నిరోధానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని మార్గదర్శక సూత్రాలు రూపొందించింది. మహిళలు రజస్వల అయిన అనంతరం నెలకు రెండుసార్లు చొప్పున తమ వక్షోజాలను పరిశీలిస్తూ, ఈకింది అంశాలేవీ లేవని నిర్ధారించుకోవాలి.  వక్షోజంలో గడ్డలు, కణుతులు వంటివి ఉన్నాయా?
ఒకవేళ ఏమైనా గడ్డవుంటే, దానిపై చర్మం కదులుతోందా? గట్టిగా కదలకుండా ఉందా?  గొంతు, మెడ, చంకల వద్ద ఏమైనా గడ్డలుగాని కణుతులుగాని ఉన్నాయా?


             వక్షోజంపై ప్రత్యేకించి ఒక ప్రదేశంలో చర్మం రంగు మారిందా? ఆ చనుమొననుంచి రక్తం స్రవిస్తోందా?  వక్షోజంలో అల్సర్‌ ఉందా? వక్షోజం రంగు పాలిపోయిన ఆరం జిరంగులోకి మారిందా? వక్షోజం ఒకవైపునుంచి మరోవైపుకు కదులుతోందా? లేదా? నొప్పిగా ఉందా? ఈ అంశాలలో ఏ ఒక్కటి గుర్తించినా.. వెంటనే కేన్సర్‌ స్పెషలిస్టును సంప్రదించండం తప్పనిసరి. అంతేకాకుండా కేన్సర్ స్పెషలిస్టులు చెప్పే ముఖ్యమైన జాగ్రత్తలు వెంటనే పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

Monday, 1 August 2016

పోషకాహారంతో కేన్సర్ దూరం

ఆరోగ్యమైన కొవ్వుతో ఉండే మధ్యధరా ఆహారమైన ఫ్యాటీ ఫిష్‌, గుడ్లు, ఆలీప్‌ అయిల్‌, అవకాడోస్‌, వివిధ రకాల గింజలు మొదలైన వాటిని తీసుకుంటే గుండె జబ్బు, టైప్‌-2 మధుమేహం, బ్రెస్ట్‌ కేన్సర్‌ వంటి జబ్బులు అభివృద్ధి కాకుండా ఉంటాయని ఓ పరిశోధనలో తేలింది. అధిక కొవ్వు పదార్థలు సేవించడానికి వివిధ రుగ్మతలు తగ్గుముఖం పట్టాడానికి యాంటీ ఇన్‌ప్లెమేటరీ ప్రభావం కారణమని అమెరికాలోని క్రానిక్‌ డిసీజ్‌ ఔట్‌కమ్స్‌ రీసర్చ్‌ కేంద్రానికి చెందిన హన్నా బ్లూమ్‌ఫీల్డ్‌ తెలిపారు. అధిక కొవ్వు తీసుకోవానికి, మరణాలకు సంబంధం లేదన్నారు. కొవ్వును పరిమితంగా తీసుకునే వారు, చెక్కర, శుద్ధి చేయని ధన్యాల నుంచి కెలరీలను పొందుతుంటారని బ్లూమ్‌ఫీల్డ్‌ పేర్కొన్నారు.
     

పండ్లు, కూరగాయలలో ఉండే విటమిన్, మినరల్స్ కేన్సర్ వ్యాధికి వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడతాయి. ఇవి కేన్సర్ వ్యాధి వలన ప్రమాదానికి గురైన కణాలను తిరిగి యధా స్థానానికి తీసుకురావటంలో సహాయపడతాయి.  మాంసం, రెడ్ మీట్ వంటి వాటికి దూరంగా ఉండాలి. వీటికి బదులుగా పోషకాలు అధికంగా గల పండ్లు మరియు కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి.



Sunday, 31 July 2016

మోనోపాజ్ లోపే కేన్సర్ ముప్పు ఎక్కువ

50 ఏళ్ల‌లోపు వ‌య‌స్సున్న మ‌హిళ‌లు కేన్స‌ర్ బారిన ప‌డుతున్నార‌ని నేష‌న‌ల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ కేన్స‌ర్ ప్రివెన్ష‌న్ అండ్ రీసెర్చ్ చేసిన తాజా అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. మారుతున్న జీవ‌న ప్ర‌మాణాలే మ‌హిళల్లో కేన్స‌ర్‌కు దారితీస్తున్నాయ‌ని స్ట‌డీ తెలిపింది. ఆల‌స్యంగా వివాహాలు చేసుకోవ‌డం.. లైంగికంగా ఒక‌రికి మించి భాగ‌స్వామ్యుల‌తో క‌ల‌వ‌డం, ఆల‌స్యంగా గ‌ర్భం దాల్చ‌డం కూడా భార‌తీయ స్త్రీలు కేన్స‌ర్‌కు కార‌ణ‌మ‌వుతున్నాయ‌ని విశ్లేషించింది. కేన్స‌ర్ బారిన ప‌డిన మ‌హిళ‌లు 2 శాతం మంది 20-30 ఏళ్ల వ‌య‌స్సున్న వారుండ‌గా..16శాతం మంది 30-40 ఏళ్ల‌ వ‌య‌స్సున్న వారున్న‌ారు. 40-50 ఏళ్ల వ‌య‌స్సున్న వారు 28 శాతం మంది ఈ మ‌హ‌మ్మారికి బ‌ల‌వుతున్నార‌ు.  మొత్తంగా 46 శాతం భార‌తీయ మ‌హిళ‌లు యాభై ఏళ్లలోపు వయసు వారిగా ఉన్నారు. ఇది ఆందోళ‌న క‌లిగించే విష‌య‌మ‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు.


        స్త్రీల‌కు సంబంధించి త‌లెత్తుతున్న స‌మ‌స్య‌లు బాహాటంగా చెప్పుకోలేక‌పోవ‌డంతో.. వ్యాధి ముదిరి కేన్స‌ర్‌గా బ‌య‌ట‌పడుతోంద‌ని వైద్యులు చెప్పారు. భార‌త్‌లో ప్ర‌తి 8 నిమిషాల‌కు ఓ మ‌హిళ స‌ర్విక‌ల్ కేన్స‌ర్‌తో మ‌ర‌ణిస్తోంద‌ని నేష‌న‌ల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ కేన్స‌ర్ ప్రివెన్ష‌న్ అండ్ రీసెర్చ్ సంస్థ తెలిపింది. బ్రెస్ట్ కేన్స‌ర్‌తో డ‌యాగ్నైస్ అయిన ఇద్ద‌రు మ‌హిళ‌ల్లో ఒక‌రు మృతి చెందుతుండ‌గా.. పొగాకు ఉత్ప‌త్తులు సేవిస్తున్న వారు రోజుకు 2500 మంది మృత్యువాత ప‌డుతున్న‌ట్లు అధ్య‌య‌నం వెల్ల‌డించింది. ఫ‌లానా నొప్పితో హాస్పిట‌ల్‌కు వ‌చ్చేస‌రికి కేన్స‌ర్ వ్యాధి అప్ప‌టికే ముద‌రి పోయిఉంటుంద‌ని వైద్యులు చెబుతున్నారు. 

Thursday, 30 June 2016

డాక్టర్స్ డే స్పెషల్

వైద్యుడు లేనిచోట  ఆవాసమే ఏర్పాటుచేసుకోవద్దని సలహా ఇస్తాడు సుమతీశతకకారుడు. మరికొందరు... వైద్యుడంటే సాక్షాత్తూ నారాయణుడే అని ప్రస్తుతించారు. వైద్యుడు సాక్షాత్తూ నారాయణుడూ, హరీ కాబట్టే ‘యుద్ధం చేయలేను’ అంటూ యాంగ్జైటీకి, డిప్రెషన్‌కు గురైన అర్జునుడికి గీతాకౌన్సెలింగ్ నిర్వహించాడు. అలా అర్జునుడికి సైకోథెరపీ చికిత్స చేసిన తొలి సైకియాట్రిస్ట్‌గా గణుతికెక్కాడు శ్రీకృష్ణుడు. శివుడికి వైద్యనాథుడంటూ మరోపేరు. ఆయన వైద్యనాథుడు కాబట్టే వినాయకుడికి ఏనుగుతల అతికించి, బతికించాడు. దీన్ని తొలి ప్లాస్టిక్ సర్జరీ అని చాలామంది  అనుకుంటారుగాని... నిజానికి అది తొలి ‘హెడ్ ట్రాన్స్‌ప్లాంటేషన్’ శస్త్రచికిత్స అనుకోవచ్చు. ఇలాంటి అద్భుతాలు చేసినందుకే ఆ దేవుళ్లు డాక్టర్ల హోదా పొందారు. పనిలోపనిగా మన ఇల-డాక్టర్లకూ సాక్షాత్తూ దేవతలతో  సమానమైన హోదా ఇచ్చి గౌరవించారు మనుషులు.
                  తనకు కలిగిన రుగ్మతనూ, బాధనూ పోగొట్టగలిగిన సామర్థ్యం కలిగి ఉండాలి వైద్యుడు. ఆ నమ్మకాన్ని రోగిలో పాదుగొల్పడం కోసం వైద్యుడి వస్త్రధారణ హుందాగా ఉండటం ఎంతో ముఖ్యం. అప్పుడే రోగికి వైద్యుడి మీద నమ్మకం కలుగుతుంది. అందుకే మెడికల్ కాలేజీలో చేరాక శుభ్రంగా ఉంటేతప్ప అనాటమీ క్లాసులకు అనుమతించరు. వీటికి తోడు డాక్టర్ తెల్లకోటును ధరించి ఉండాలి. ఈ తెల్లకోటును చూసిన వెంటనే దేవదూత ఆరోగ్యాన్నివ్వడానికి వస్తున్నాడన్న నమ్మకం కలగాలి. కానీ ఈ నమ్మకం ఇప్పుడు సడలుతోందేమోనన్న సందేహం వస్తోంది. కొందరికి ఈ తెల్లకోటు చూస్తేనే ఆందోళన. వైద్యశాస్త్రంలో.. వైట్‌కోట్ హైపర్‌టెన్షన్ అంటూ దీన్ని చూడగానే రక్తపోటు పెరిగిపోయే రుగ్మతను ‘వైట్‌కోట్ సిండ్రోమ్’ అని ఒక వ్యాధే రూపొందింది. స్వతహాగా వైద్యమంటే భయం ఉండే ఈ వ్యాధిని తమ ప్రవర్తనతోనే పూర్తిగా రూపుమాపాల్సిన బాధ్యత ఆ వైట్‌కోట్‌లు ధరించిన వారిపైనే ఉంది. అదీ దీని ఘనత.


             రోగి వైద్యుడిని నమ్మి అతడి వద్దకు వస్తాడు. అతడిపై విశ్వాసం ఉంచి వైద్యం చేయించుకుంటాడు. రోగి ఎవరైనా సరే... అతడి గురించిన సమాచారాన్ని వైద్యుడు గోప్యంగా ఉంచాలి. రోగి అనుమతి లేకుండా,  అతడి రోగానికి సంబంధించిన సమాచారం, ఫొటోల వంటివాటిని ఉపయోగించకూడదు. ఇది నైతికనియమం. మామూలు రోగుల పట్లనే గాక, నేరస్తులు, నిందితుల వంటి వారిపట్ల కూడా వైద్యుడు వీటిని పాటించాలి. లాడెన్‌ను పట్టుకునేందుకు అమెరికా ఒక వైద్యుడిని  నియోగించింది. డాక్టర్ షకీల్ ఆఫ్రీదీ అనే వైద్యుడిని లాడెన్ వద్దకు పంపి, అతడి డీఎన్‌ఏ నమూనాలను సేకరించి, అతడే లాడెన్ అని నిర్ధారణ చేసుకున్న తర్వాత దాడి చేసింది. ఆ తర్వాత డాక్టర్ షకీల్‌ను వైద్యనియమావళి ఉల్లంఘించాడన్న ఆరోపణతో ఒకవైపు పాకిస్థాన్ అతడిని జైల్లో పెట్టింది. మరోవైపు అమెరికా... ముఖం చాటేసింది. రోగి ఎవరైనాసరే అతడి తాలూకు, అతడి జబ్బు తాలూకు రహస్యాలను గోప్యంగా ఉంచడం అన్న నైతిక నియమాన్ని పాటించనందుకు డాక్టర్ షకీల్ అఫ్రీదీ కెరియర్ పూర్తిగా నాశనమైంది.

  ఒక రోగి డాక్టర్‌గా మిమ్మల్ని పూర్తిగా నమ్మేలా చూసుకోండి. విశ్వసించేలా చేసుకోండి. అప్పుడే వైద్యుడు నారాయణుడవుతాడు. వైద్యవిద్యా పారీణుడవుతాడు. వైద్యసేవా పరాయణుడవుతాడు.

Monday, 20 June 2016

యోగాతో కొత్త ఉత్తేజం



నీ సహజ రూపం ఏమిటో, నీ వాస్తవ స్వభావం ఏదో తెలుసుకోడానికి...హిమాలయాల దాకా వెళ్లాల్సిన పన్లేదు, గురువుల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిన అవసరం లేదు, గూగుల్‌ సెర్చింజిన్‌ గోలే అక్కర్లేదు. ఐదారేళ్ల పిల్లల్ని గమనిస్తే చాలు. నీ ప్రశ్నకు సమాధానం దొరికిపోతుంది. ఆ పసివాళ్లని చూడండి. బుల్లిబుల్లి అడుగులేస్తూ ఇల్లంతా పరిగెడతారు. ఆడుతూ పాడుతూ జానెడంత నడుమును చక్రంలా తిప్పేస్తారు. ఏ మాత్రం కష్టపడకుండా విల్లులా ఒంగిపోతారు. చేతులతో పాదాల్ని సునాయాసంగా పట్టుకుంటారు. ఆ మొహంలో మహా నిర్మలత్వం! బొమ్మల కోసమో, బిస్కెట్ల కోసమో మారాం చేసినా...అదీ కాసేపే! మరునిమిషమే హాయిగా నవ్వేస్తారు. వాళ్లకి ద్వేషం తెలియదు, అసూయ తెలియదు. స్వార్థం తెలియదు. అది నిత్య యోగస్థితి! ఒకప్పుడు, నువ్వూ ఇలానే ఉండేవాడివి. నీ స్వభావమూ దాదాపుగా అదే. నీ శరీరంలోని అనారోగ్యాల్నీ, నీ మనసులోని జాడ్యాల్నీ శుభ్రంగా తొలగించుకుంటే...మిగిలేది పసిపాప లాంటి, ఆ నువ్వే. ఆ చెత్తంతా వదిలించుకోడానికి ఒకటే మార్గం యోగా.
 
          నీ  ఆకారం ఏమిటి ఇలా మారిపోయింది, కొబ్బరిచెట్టులా నిటారుగా ఉండాల్సిన వాడివి... కాపుకొచ్చిన మామిడి కొమ్మలా ఒంగిపోయావెందుకు? నీ పొట్టేమిటి అలా ముందుకొచ్చింది, చొక్కా లోపల స్టీలు బిందె దాచుకున్నట్టు? ఆ నడుమేమిటి అంతగా ముడతలు పడిపోయింది, చుట్టూ క్యారీ బ్యాగులు తగిలించుకున్నట్టు?
ఈ వంకరటింకర రూపం, ఈ బాన పొట్ట, ఈ కొవ్వుపట్టిన నడుమూ...ఇవేవీ నీవి కాదు. నీ సహజ రూపంలో ఏ ఒక్కటీ లేవు. అసలు, మనిషి అన్నవాడి ఆకృతే ఇలా ఉండదు.
నీది కాని బరువును దించేసుకో.
నీకు అక్కర్లేని కొవ్వును కరిగించుకో.
నిన్ను గుర్తుపట్టకుండా చేస్తున్న ముడతల్ని సరిచేసుకో.
అలా అని ప్లాస్టిక్‌ సర్జరీల పేరుతో కార్పొరేట్‌ ఆసుపత్రులకు లక్షలకు లక్షలు సమర్పించుకోవద్దు. బ్యూటీ ట్రీట్‌మెంట్స్‌ కోసం ఆస్తుల్ని కరిగించుకోవద్దు. మందులూ మాత్రల జోలికి వెళ్లనే వెళ్లొద్దు. నీ శరీరాన్ని నీకు తిరిగిచ్చే శక్తి యోగాకు ఉంది.