Sunday 17 April 2016

నిద్ర తక్కువైతే.. కేన్సర్ ప్రమాదం..!



మానవుడికి పరిపూర్ణమైన ఆరోగ్యం నిద్ర వల్లనే వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఎన్ని కసరత్తులు చేసినప్పటికీ రాని ఆరోగ్యం నిద్ర వల్ల వస్తుందట. నిద్ర గనుక ఏమాత్రం తక్కువైతే మాత్రం కేన్సర్ కోరల్లో చిక్కుకోక తప్పదంటున్నారు అమెరికన్ పరిశోధకులు. ప్రతిరోజూ వ్యాయామం చేసే మహిళలతో పోలిస్తే... ఏడు గంటల కంటే తక్కువగా నిద్రపోయే మహిళలలో బ్రెస్ట్ కేన్సర్ లేదా కలోన్ కేన్సర్ వచ్చే అవకాశాలు 47 శాతం ఎక్కువగా ఉన్నట్లు తమ పరిశోధనల్లో తేలిందని వారంటున్నారు.


                    వాషింగ్టన్‌లో జరిగిన అమెరికన్ అసోసియేషన్ సమావేశంలో పరిశోధనల వివరాలను వెల్లడించారు. ఈ పరిశోధనల్లో కనుగొన్న విషయాల గురించి అమెరికా జాతీయ కేన్సర్‌ సంస్థకు చెందిన జేమ్స్ మెక్‌క్లెయిన్ మాట్లాడుతూ... పరిశోధనా వివరాలు తమని ఆశ్చర్యానికి గురి చేశాయని, ఏమైనప్పటికీ దీనిపై ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందని అన్నారు. తక్కువ నిద్రతో కేన్సర్ ఎలా వస్తుందో తమకు పూర్తిగా అర్థంకాని విషయంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

No comments:

Post a Comment