Friday, 30 June 2017

కేన్సర్ బీ 17 లోపమా..?



కేన్సర్ ఒక భయంకరమైన, ప్రాణాంతక వ్యాధి కాదని, విటమిన్ బి17 లోపమని ఓ విధమైన వాదన ప్రపంచవ్యాప్తంగా ఉంది. బి17 విటమిన్ లభించే ఆహారాన్ని తీసుకుంటే చాలు కేన్సర్ కు దూరంగా ఉండవచ్చన్న అధ్యయనాలూ ఉన్నాయి. ఇది నిజమేనా...? అన్న సందేహం చాలా మందిలో ఉండే ఉంటుంది. మరి ఆ నిజా నిజాలేంటో పలువురు పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం తెలుసుకుందాం.


బి1, బి2, బి6, బి12 విటమిన్లు గురించి వినే ఉంటారు...మరి బి17 ఎక్కడి నుంచి వచ్చింది...? నిజానికి విటమిన్ బి17 అంటూ ఏదీ లేదు. అమిగ్డాలిన్ నుంచి రూపొందించే లాట్రిలే అనే ఔషధానికి పెట్టిన నామం బి17. చాలా రకాల మొక్కల్లో లభించే విషపూరిత సైనోజెనిక్ గ్లైకోసైడ్ నే అమిగ్డాలిన్ గా పేర్కొంటారు. ఈ అమిగ్డాలిన్ ను మెరుగుపరిచి లాట్రిలేగా మారుస్తారు. శాస్త్రీయ నామం మాండెలో నైట్రిల్ బీటా డీ జెంటియోబయోసైడ్. దీన్నే నైట్రిలోసైడ్ గానూ భావిస్తారు. ఇది సైనేడ్ ను కలిగి ఉండే సహజ పదార్థం. ఇది శరీరానికి కావాల్సిన కనీస పోషకమేమీ కాదు. హైడ్రోజెన్ సైనేడ్ ను ఉత్పత్తి చేయడం ద్వారా కేన్సర్ విస్తరణను అడ్డుకుంటుందని కొందరు వైద్యులు సొంతంగా పరిశోధనలు చేసి ప్రకటించారు. కానీ, ఇంతవరకూ ఏ ప్రభుత్వమూ దీన్ని గుర్తించలేదు.

Tuesday, 20 June 2017

యోగాతో అందరికీ ఆరోగ్యం

యోగా అంటే వ్యాయామ సాధనల సమాహారాల ఆధ్యాత్మిక రూపం. ఇది హిందూత్వ అధ్యాత్మిక సాధనలలో ఒక భాగం. మోక్షసాధనలో భాగమైన ధ్యానం అంతఃదృష్టి, పరమానంద ప్రాప్తి లాంటి అధ్యాత్మిక పరమైన సాధనలకు పునాది. దీనిని సాధన చేసే వాళ్ళను యోగులు అంటారు. వీరు సాధారణ సంఘ జీవితానికి దూరంగా మునులు సన్యాసులవలె అడవులలో ఆశ్రమ జీవితం గడుపుతూ సాధన శిక్షణ లాంటివి నిర్వహిస్తుంటారు. ధ్యానయోగం ఆధ్యాత్మిక సాధనకు మానసిక ఆరోగ్యానికి చక్కగా తోడ్పడుతుంది. హఠయోగములో భాగమైన శారీరకమైన ఆసనాలు శరీరారోగ్యానికి తోడ్పడి ఔషధాల వాడకాన్ని తగ్గించి దేహధారుడ్యాన్ని, ముఖ వర్చస్సుని ఇనుమడింప చేస్తుంది.


            బుద్ధమతం, జైనమతం, సిక్కుమతం మొదలైన ధార్మిక మతాలలోనూ, ఇతర ఆధ్యాత్మిక సాధనలలోను దీని ప్రాధాన్యత కనిపిస్తుంది.
హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయంలో భాగమైన యోగాన్ని శాస్త్రీయంగా క్రోడీకరించిన ఆద్యుడు పతంజలి. క్రీస్తు పూర్వము 100వ శకము 500వ శకము మధ్య కాలములో ఈ రచన జరిగినట్లు పరిశోధకులు విశ్వసిస్తున్నారు. ఉపనిషత్తులు, భగవద్గీతలో యోగా ప్రస్తావన ఉంది. పతంజలి వీటిని పతంజలి యోగసూత్రాలు గా క్రోడీకరించాడు. సూత్రము అంటే దారము. దారములో మణులను చేర్చినట్లు యోగశాస్త్రాన్ని పతంజలి ఒకచోట చేర్చాడు. హఠయోగ ప్రదీపిక, శివ సంహిత దానిలో ప్రధాన భాగాలు. అంతర్భాగాలైన కర్మయోగము, జ్ఞానయోగము, రాజయోగము, భక్తియోగము మొదలైనవి హిందూతత్వంలో భాగాలు. 

Saturday, 13 May 2017

అమ్మలకు కేన్సర్ టెస్ట్ తప్పనిసరి

సృష్టికి ప్రతి సృష్టి అమ్మ. ప్రపంచంలో అన్నింటి కన్నా మధురమైనది, తియ్యనైనది, అపురూపమైనది అమ్మ ప్రేమ. యుగాలు మారిన, తరాలు మారిన, మారనిది అమ్మ అభిమానం.  అమ్మ ప్రేమ వెలకట్టలేనిది, విలువ కట్టలేనిది. తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయక తన ఆనందాన్ని కుటుంబం కోసం, పిల్లలకోసం త్యజించేది అమ్మఒక్కతే. అమ్మ గురించి ఎంత చెప్పకున్నా తక్కువే. అలాంటి అమ్మ మరో ప్రాణికి జన్మనిచ్చే సమయం అంటే ఆమెకు పునర్జన్మే. అలాంటప్పుడు ఆరోగ్యం గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రతి మహిళా జీవితంలో అత్యంత సున్నితమైనది మాతృత్వం. మహిళ గర్భం దాల్చినప్పుడు శారీరకంగా, మానసికంగా చాలా మార్పులు వస్తాయి. కొంతమందిలో ఏమి తిన్నా వెంటనే వాంతి అవ్వడం, కొన్ని రకాలవాసనలు పడకపోవడం సహజం. అలాంటప్పుడు ఏమీ తినకపోవడం వల్ల నీరసించిపోతారు. అందువల్ల ఏదో ఒక తేలిక పాటి ఆహారం తీసుకోవడం వల్ల అన్నీ క్రమంగా తగ్గుతాయి.  శరీరంలో ఉన్న హార్మోన్ల మార్పుల వల్ల ఒక్కోసారి తిన్న ఆహారం జీర్ణం కాకపోవచ్చు. ఎక్కువగా కూరగాయాలు, పండ్లు, పండ్ల రసాలు తీసుకుంటే అవి త్వరగా జీర్ణమవుతాయి. గర్భిణీలు ఒత్తిడికి లోనవకుండా, ఆనందంగా, మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. కొంతమందిలో కాళ్లు, ముఖం వంటి అవయవాలకు వాపులు వస్తుంటాయి. సాయంత్రంవేళల్లో కొద్ది సేపు వాకింగ్‌
చేయడం వల్ల ఈ వాపులను తగ్గించుకోవచ్చు.



ఇక కాన్పు తర్వాత గర్భాశయం బరువు వల్ల వెన్నునొప్పి, పిరుదులు, తొడల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ఫిజియోథెరఫీ చేయించుకోవడం వల్ల ఆ నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చు. కాన్పు తర్వాత మూత్రానాళ ఇన్‌ఫెక్ష్లన్లూ వచ్చే అవకాశాలున్నాయని వైద్యులు చెప్తారు. ఫెల్విక్‌ఫ్లోర్‌ వంటి వ్యాయామాలు చేయడం వల్లవాటిని నివారించవచ్చు. కాన్పు తర్వాత బిడ్డకు పాలు పట్టకపోవడం వల్ల రొమ్ముల్లో పాలు గడ్డకట్టి ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశాలూ ఎక్కువే. ఈ ఇన్‌ఫెక్షన్లు తల్లి శరీరంలోకి వ్యాపించే ప్రమాదమూ ఉంది. అలాగే పిల్లల నోటిలో పూతల వల్ల రోగక్రిములు రొమ్ముల్లోకి చేరి, చీముగడ్డలు ఏర్పడవచ్చు. అందువల్ల పిల్లలకు పాలిచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు
తీసుకోవాలి. సీజేరియన్‌ అయిన వాళ్లు కుట్ల దగ్గర చీము పట్టకుండా చూసుకోవాలి.

కాన్పు తర్వాత రక్తస్రావం జరగడం సహజమే. కానీ అదే ఎక్కువ అవుతుంటే దాన్ని వైద్య పరిభాషలో ఫోస్ట్‌ పార్టమ్‌ హేమరేజ్‌ అంటారు. దీనికి ప్రధాన కారణం గర్భాశయ ముఖద్వారం చీరిపోవడం, గర్భాశయం లోపల మాయ మిగిలిపోవడం, గర్భాశయం కుంచించుకుపోవడం. బ్లీడింగ్ ఎక్కువ అయితే తల్లి ప్రాణానికే ప్రమాదం. కాబట్టి వెంటనే వైద్యులు తగిన చర్యలు తీసుకోవాలి.  కాన్పు తర్వాత తల్లులు తమ ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా పిల్లల మీదే ఎక్కువ శ్రద్ధపెట్టడం వల్ల ఇలాంటి అనర్థాలు ఎక్కువగా జరిగి తల్లిప్రాణానికే ముప్పు వాటిల్లుతుంది. కాన్పు అవక ముందు, అయిన తర్వాత కూడా తల్లి తన ఆరోగ్యం గురించి అన్ని విధాలా పట్టించుకోవాలి.

Friday, 7 April 2017

మామిడి పండుతో కేన్సర్ దూరం

మిగతా పండ్లతో పోలిస్తే మామిడి పండులోని పోషక విలువల గురించి ప్రచారం తక్కువే! భారతీయుల ఇంటింటి ఆహారమైన ఈ మామిడిపండు గురించి పాశ్చాత్యులు కాస్త చులకనగానే చూస్తారు. మామిడి కేవలం జిహ్మచాపల్యాన్ని తీర్చే తీపి పండుగానే గుర్తిస్తారు.  అమెరికాలో మామిడిపండు గురించి ఓ ఆసక్తికరమైన పరిశోధన జరిగింది. స్త్రీ జీవితంలో విషాన్ని నింపే బ్రెస్ట్ క్యాన్సర్ను మామిడిపండు ఎదుర్కొంటుందని నిరూపించింది.



మామిడిపండులోని polyphenol అనే రసాయనాలు కేన్సర్ కణాల మీద ఏ మేరకు ప్రభావం చూపుతాయో గమనించారు పరిశోధకులు. ఇందుకోసం పెద్దపేగు, వక్షోజాలు, ఊపిరితిత్తులు, ప్రొస్టేటు తదితర కేన్సర్ కణాల మీద ఈ polyphenolsను ప్రయోగించి చూశారు. వీటిలో ప్రొస్టేట్, లుకేమియా, ఊపిరితిత్తుల క్యాన్సర్ కణాల మీద మామిడిపళ్లు ఎంతోకొంత ప్రభావం చూపినట్లు గ్రహించారు. ఆశ్చర్యకరంగా వక్షోజ (breast), పెద్దపేగు(colon) క్యన్సర్ కణాలని నిరోధించడం, నాశనం చేయడంలో beమిడిపండ్లు అద్భుతమైన ప్రభావం చూపాయట!
చాలా క్యాన్సర్ చికిత్సలలో క్యాన్సర్ కణాలతో పాటుగా ఆరోగ్యవంతమైన కణాలు కూడా దెబ్బతింటూ ఉంటాయి. దీని వల్ల రోగి నీరసించిపోవడం, మళ్లీ క్యాన్సర్ బారిన పడటం జరుగుతుంది. కానీ మామిడిపండు నుంచి తీసిన రసాయనాలు మాత్రం కేవలం క్యాన్సర్ కణాల మీదే దాడి చేయడం గమనార్హం. మామిడి నుంచి తీసిన polyphenols క్యాన్సర్ కణాల మీద పనిచేసే తీరు కూడా చిత్రంగా ఉంది. విచ్చలవిడిగా పెరిగిపోతున్న క్యాన్సర్ కణాలను నిరోధించడంతో పాటుగా.... దెబ్బతిన్న కణాలను బాగుచేయడం ద్వారా polyphenols అద్భుతమైన ప్రభావాన్ని చూపాయట.
తమ పరిశోధనతో మామిడపండు సత్తా తెలిసింది కాబట్టి, polyphenolsను తీసిన మందులతో క్యాన్సర్ చికిత్సను ప్రారంభించే ప్రయత్నాలు మొదలుపెట్టాలని పరిశోధకులు కోరుకుంటున్నారు. ఆ మందులు, చికిత్సలు అందుబాటులోకి వచ్చేందుకు కొంత కాలం పడుతుంది కాబట్టి, ఈలోగా తియ్యటి మామిడిపంఢ్ల రుచిని కాస్త ఆస్వాదిస్తే సరి!

Thursday, 6 April 2017

ఆరోగ్యమే మహాభాగ్యం

 
ప్రతి రోజూ ఉరుకులు, పరుగులు. డైలీ లైఫ్ లో ఎన్నో సవాళ్లు…. బిజీలో పడిపోయి లైఫ్ ని డేంజర్ లో పడేసుకుంటున్నారు జనాలు. హెల్త్ కేర్ అస్సలు పట్టించుకోవడం లేదు. దీంతో ఒక్కసారిగా వచ్చే అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్నఆరోగ్య సమస్యలపై ఎప్పటికప్పుడు అలర్ట్ చేసే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ – WHO యేటా వాల్డ్ హెల్త్ డే ను నిర్వహిస్తుంది.



డయాబెటీస్ తో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులైన  B.P, థైరాయిడ్ సమస్యతో జనం అనారోగ్యానికి గురవుతున్నారు. అన్నింటికి మించి..మనం తీసుకుంటున్న ఆహారం పొల్యూట్ అవడం హెల్త్ పై ఎఫెక్ట్ చూపిస్తోంది. పండ్లు, కూరగాయలు కూడా రసాయనాలతో పండించినవి తినాల్సిరావడం భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడమే అవుతుందంటున్నారు డాక్టర్లు. క్యాన్సర్, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ డిసీజెస్ పై అవేర్ నెస్ పెరగాలంటున్నారు. ఆరోగ్యమే..మహాభాగ్యం. హెల్త్ బాగుంటేనే అన్నీ సెట్ అవుతాయి. సో ఎంత బిజీ లైఫ్ అయినా హెల్త్ పై కేర్ తప్పనిసరి అంటోంది WHO.

Friday, 3 February 2017

కేన్సర్‌ను నిరోధించేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

 కేన్సర్ వ్యాధి సంక్రమించడానికి కారణం ఫలానా అని చెప్పలేకపోవచ్చు కానీ దాన్ని నిరోధించేందుకు మాత్రం ప్రత్యేకంగా కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటుంటే వ్యాధిని అడ్డుకోవచ్చని పరిశోధనాల్లో తేలింది. ప్రపంచ కేన్సర్ డే ఫిబ్రవరి 4 సందర్భంగా ఆ వివరాలను తెలుసుకుందాం...
            ప్రతిరోజూ తినే ఆహారంలో అత్యధిక స్థాయిల్లో ఫైబర్ నిల్వలున్న పదార్థాలను తీసుకునేవారిలో కేన్సర్ వ్యాధి రావడం చాలా తక్కువ. పండ్లు, కూరగాయలు వంటివి ఎక్కువగా తీసుకునే మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్ వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెపుతున్నాయి. అంతేకాదు ప్రొస్టేట్ కేన్సర్ రాకుండా అడ్డుకోవడంలో పండ్లు, కూరగాయలు కీలక పాత్రను పోషిస్తాయి.




    

చైనా పరిశోధనల ప్రకారం తెల్లని కూరగాయలు, బంగాళాదుంపలు, క్యాలీఫ్లవర్ వంటివి తీసుకుంటుంటే కేన్సర్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. వీటిని తీసుకునేవారిలో వ్యాధి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే జీర్ణాశయ కేన్సర్‌ను కూడా అడ్డుకునే శక్తి వీటికి ఉంది.

Wednesday, 1 February 2017

ఆ కేన్సర్ డేంజర్!

శారీరక కేన్సర్ కంటే చుట్టూ ఉండే సమాజం, దగ్గరివాళ్లు దూరం పెట్టడమే పేషంట్లను అధికంగా బాధిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కేన్సర్ ఉందని తెలియగానే చాలా మంది సదరు పేషంట్లను దూరం పెట్టడం, వారిని మునుపటిలా పలుకరించకపోవడం చేస్తారని దీనికి వల్ల కేన్సర్ పేషంట్లు మానసికంగా కుంగిపోతారని లండన్ లోని సౌత్ హంప్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ క్లేర్ ఫోస్టర్ వెల్లడించారు.






              
 కేన్సర్ నివారణ  కోసం కిమో థెరపీ ప్రారంభించినప్పుడు, ఆ తరువాత కోలుకున్నాక కొన్నాళ్ల వరకు కూడా పేషంట్లకు సోషల్ సపోర్ట్ దక్కడం లేదని, మనసు విప్పి మాట్లాడేందుకు ఎవరూ ఉండటం లేదని స్టడీ గుర్తించింది. చికిత్స అనంతరం వాళ్లకు సాయం చేయడానికి, ఇంటి పనులు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని స్టడీ వెల్లడించింది.