Friday, 7 April 2017

మామిడి పండుతో కేన్సర్ దూరం

మిగతా పండ్లతో పోలిస్తే మామిడి పండులోని పోషక విలువల గురించి ప్రచారం తక్కువే! భారతీయుల ఇంటింటి ఆహారమైన ఈ మామిడిపండు గురించి పాశ్చాత్యులు కాస్త చులకనగానే చూస్తారు. మామిడి కేవలం జిహ్మచాపల్యాన్ని తీర్చే తీపి పండుగానే గుర్తిస్తారు.  అమెరికాలో మామిడిపండు గురించి ఓ ఆసక్తికరమైన పరిశోధన జరిగింది. స్త్రీ జీవితంలో విషాన్ని నింపే బ్రెస్ట్ క్యాన్సర్ను మామిడిపండు ఎదుర్కొంటుందని నిరూపించింది.



మామిడిపండులోని polyphenol అనే రసాయనాలు కేన్సర్ కణాల మీద ఏ మేరకు ప్రభావం చూపుతాయో గమనించారు పరిశోధకులు. ఇందుకోసం పెద్దపేగు, వక్షోజాలు, ఊపిరితిత్తులు, ప్రొస్టేటు తదితర కేన్సర్ కణాల మీద ఈ polyphenolsను ప్రయోగించి చూశారు. వీటిలో ప్రొస్టేట్, లుకేమియా, ఊపిరితిత్తుల క్యాన్సర్ కణాల మీద మామిడిపళ్లు ఎంతోకొంత ప్రభావం చూపినట్లు గ్రహించారు. ఆశ్చర్యకరంగా వక్షోజ (breast), పెద్దపేగు(colon) క్యన్సర్ కణాలని నిరోధించడం, నాశనం చేయడంలో beమిడిపండ్లు అద్భుతమైన ప్రభావం చూపాయట!
చాలా క్యాన్సర్ చికిత్సలలో క్యాన్సర్ కణాలతో పాటుగా ఆరోగ్యవంతమైన కణాలు కూడా దెబ్బతింటూ ఉంటాయి. దీని వల్ల రోగి నీరసించిపోవడం, మళ్లీ క్యాన్సర్ బారిన పడటం జరుగుతుంది. కానీ మామిడిపండు నుంచి తీసిన రసాయనాలు మాత్రం కేవలం క్యాన్సర్ కణాల మీదే దాడి చేయడం గమనార్హం. మామిడి నుంచి తీసిన polyphenols క్యాన్సర్ కణాల మీద పనిచేసే తీరు కూడా చిత్రంగా ఉంది. విచ్చలవిడిగా పెరిగిపోతున్న క్యాన్సర్ కణాలను నిరోధించడంతో పాటుగా.... దెబ్బతిన్న కణాలను బాగుచేయడం ద్వారా polyphenols అద్భుతమైన ప్రభావాన్ని చూపాయట.
తమ పరిశోధనతో మామిడపండు సత్తా తెలిసింది కాబట్టి, polyphenolsను తీసిన మందులతో క్యాన్సర్ చికిత్సను ప్రారంభించే ప్రయత్నాలు మొదలుపెట్టాలని పరిశోధకులు కోరుకుంటున్నారు. ఆ మందులు, చికిత్సలు అందుబాటులోకి వచ్చేందుకు కొంత కాలం పడుతుంది కాబట్టి, ఈలోగా తియ్యటి మామిడిపంఢ్ల రుచిని కాస్త ఆస్వాదిస్తే సరి!

No comments:

Post a Comment