Thursday, 6 April 2017

ఆరోగ్యమే మహాభాగ్యం

 
ప్రతి రోజూ ఉరుకులు, పరుగులు. డైలీ లైఫ్ లో ఎన్నో సవాళ్లు…. బిజీలో పడిపోయి లైఫ్ ని డేంజర్ లో పడేసుకుంటున్నారు జనాలు. హెల్త్ కేర్ అస్సలు పట్టించుకోవడం లేదు. దీంతో ఒక్కసారిగా వచ్చే అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్నఆరోగ్య సమస్యలపై ఎప్పటికప్పుడు అలర్ట్ చేసే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ – WHO యేటా వాల్డ్ హెల్త్ డే ను నిర్వహిస్తుంది.



డయాబెటీస్ తో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులైన  B.P, థైరాయిడ్ సమస్యతో జనం అనారోగ్యానికి గురవుతున్నారు. అన్నింటికి మించి..మనం తీసుకుంటున్న ఆహారం పొల్యూట్ అవడం హెల్త్ పై ఎఫెక్ట్ చూపిస్తోంది. పండ్లు, కూరగాయలు కూడా రసాయనాలతో పండించినవి తినాల్సిరావడం భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడమే అవుతుందంటున్నారు డాక్టర్లు. క్యాన్సర్, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ డిసీజెస్ పై అవేర్ నెస్ పెరగాలంటున్నారు. ఆరోగ్యమే..మహాభాగ్యం. హెల్త్ బాగుంటేనే అన్నీ సెట్ అవుతాయి. సో ఎంత బిజీ లైఫ్ అయినా హెల్త్ పై కేర్ తప్పనిసరి అంటోంది WHO.

No comments:

Post a Comment