Monday, 31 July 2017

ఫేస్‌ క్రీంలతో కేన్సర్‌?


నల్లగా ఉన్నామనే న్యూనతతో నలుగురితో కలవలేకపోతున్నారా...? అయితే మా ఫేస్‌క్రీమ్‌ వాడండి! తెల్లగా అవుతారు. అరె! మీరు నల్లగా ఉండడం వల్ల ఎవరికీ నచ్చక... ఎంతకీ పెళ్లి కావడంలేదా...? అయితే మా క్రీమ్‌ వాడిన వారంలోనే మీకు పెళ్లి ఖాయం. మగవారి అందాన్నీ మరింత ఇనుమడింపజేసేందుకు ఇప్పుడు మార్కెట్‌లోకి వచ్చేసింది సరికొత్త ఫేస్‌ క్రీమ్‌... ఇలా ఉంటాయి ఫేస్‌ క్రీమ్‌ కంపెనీల ప్రకటనలు. ఇలాంటి ప్రకటనలు చూసి మోసపోయి ఫేస్‌ క్రీమ్‌లు తెగ పులుమేసుకుంటున్నారా...? రంగు మారడం మాటేమోకాని ముందుగానే ముఖంపై ముడుతలు, ఆ తరువాత కేన్సర్‌ ఖాయం అంటున్నారు నిపుణులు. ఫేస్‌ క్రీం ఏ కంపెనీదైనా తయారీలోలో హైడ్రోక్వినాన్‌ అనే రసాయనాన్ని వాడతారు.



ఫేస్‌క్రీమ్‌ రాసిన చోట ఈ రసాయనం వల్ల నిగారింపు వస్తుంది. మెలనిన్‌ తయారు కావడం ఆగిపోయి చర్మం కింద కరల్‌ సెల్స్‌ తయారవుతాయి. రసాయనాలతో కూడిన ఈ ఫేస్‌ క్ర్రీమ్‌లు వాడడం వల్ల వచ్చే నిగారింపు తాత్కాలికమే. దీని వల్ల చర్యంపై ముడుతలు త్వరితంగా ఏర్పడి వృద్దాప్య ఛాయలు చిన్న వయసులోనే కనబడతాయి. దీర్ఘకాలంలో ఇది చర్మ కేన్సర్‌కు దారి తీస్తుంది. అందు వల్ల సహజంగా లభించే వృక్ష సంబంధమైన వాటితో చర్మ సౌందర్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి చర్మానికి అది అన్ని విధాలా మంచిది. ఇలా వచ్చిన నిగారింపు ఎక్కువకాలం నిలక డగా ఉంటుంది, సహజంగా వయసు రీత్యా ముఖంలో వచ్చే వృద్ధాప్య ఛాయలను వాయిదా వేస్తుంది. కాంతి వంతమైన చర్మం కలిగి నవారు నల్లగా ఉన్నా అందం గానే ఉంటారనే విషయా న్ని ముందుగా గమనించాలి.

Sunday, 30 July 2017

బొజ్జతో పాటు పెరుగుతున్న కేన్సర్‌ ముప్పు

పెరిగిపోతున్న బొజ్జతో కేన్సర్‌ ముప్పు కూడా పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) అధ్యయనం హెచ్చరించింది. ఇందులో ప్రేగు, రొమ్ము కేన్సర్లతో పాటు పాంక్రియాటిక్‌ కేన్సర్‌ వచ్చే ప్రమాదం ఎక్కువన్నారు. బీఎంఐ లానే పొట్ట, నడుము కొలతలు కూడా కేన్సర్‌ ముప్పును అంచనా వేయడానికి బాగా తోడ్పడతాయని అంతర్జాతీయ పరిశోధకులు వివరించారు. పొట్ట 11 సెంటీమీటర్లు పెరిగితే స్థూలకాయానికి సంబంధించిన కేన్సర్ల ముప్పు 13 శాతం పెరుగుతోందని వివరించారు.





ముఖ్యంగా బొజ్జ 8 సెంటీమీటర్లు పెరిగితే ప్రేగు కేన్సర్‌ వచ్చే ముప్పు 15 శాతం పెరుగుతోందన్నారు. ఓ అధ్యయనం ప్రకారం.. కేన్సర్‌ రావడానికి కారణమయ్యే అంశాలలో పొగ త్రాగే అలవాటు తర్వాతి స్థానం స్థూలకాయానిదేనట! బరువును నియంత్రించుకోవడం ద్వారా ఈ ముప్పును తగ్గించుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. అధిక బరువుతో లైంగిక హర్మోన్ల స్థాయుల్లో మార్పులు చోటుచేసుకొని, కేన్సర్‌ ముప్పును పెంచుతున్నాయన్నారు.

Saturday, 29 July 2017

అనారోగ్య జీవనశైలితో పెద్దపేగు కేన్సర్

జీవనశైలి మార్పుల కారణంగా వస్తున్న ప్రాణాంతక సమస్యల్లో పెద్దపేగు కేన్సర్ ఒకటి. ఇటీవలి కాలంలో ఈ తరహా కేన్సర్ కేసులు పెరగటం ఏంటో ఆందోళన కలిగిస్తోన్న అంశం. అయితే సమస్యకు గల కారణాలను అవగాహన చేసుకొని తగిన జాగ్రత్తలు తీసుకొంటే ఈ సమస్యను నివారించటం సాధ్యమే. తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమైన తర్వాత మిగిలిన వ్యర్ధాలు మలంగా మారతాయి. దీనిని బయటికి పంపటమే పెద్దపేగు పని. పెద్దపేగు(కొలన్)కు సోకిన కేన్సర్ ను  కొలన్ కేన్సర్ అనీ, పెద్దపేగు చివరి భాగమైన పాయువుకు సోకితే రెక్టల్ కేన్సర్ అంటారు.




ఈ తరహా కేన్సర్ సోకినప్పుడు పేగు బిగుసుకు పోవటం, పేగులోపల తిత్తులు(పాలిప్స్) ఏర్పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో ఈ లక్షణాలు అసలు కనిపించక పోవచ్చు. పెద్దపేగు కేన్సర్ వంశపారంపర్యంగా వస్తుందని చెప్పే ఖచ్చితమైన ఆధారాలు లేకపోయినా రాదని మాత్రం గ్యారెంటీ లేదు. అందుకే పెద్దలకు ఈ సమస్య ఉన్నప్పుడు ముందు జాగ్రత్తగా 15 ఏళ్ళు నిండిన వారి పిల్లలకు ఏడాదికి ఒకసారి ఈ పరీక్షలు చేయించటం అవసరం. ఎంత ముందుగా సమస్యను గుర్తించగలిగితే అంత  సమర్ధవంతంగా దీన్ని నయం చేయవచ్చు. సమస్యను ప్రాథమిక స్థాయిలో గుర్తించే పలు ఆధునిక పరీక్షలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

Friday, 28 July 2017

పసుపుతో కేన్సర్ కు చెక్

పసుపులో ఔషధ గుణాలున్నాయని మన పూర్వీకులు ఏనాడో చెప్పారు. ఇప్పుడు దీనికున్న మరో అద్భుతమైన గుణాన్ని శాస్త్రవేత్తలు పరిశోధించి కనుగొన్నారు. యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసే పసుపు కేన్సర్‌ నిరోధించడానికీ సాయపడుతుందని అమెరికా శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. ఈ బృందంలో భారత సంతతి శాస్త్రవేత్త కూడా ఉండడం విశేషం! పసుపులో ఉండే కర్కమిన్‌ సాయంతో పసికందులలో వచ్చే కేన్సర్‌ను సమర్థమంతంగా నిరోధించవచ్చట.



కాగా, పదేళ్లలోపు చిన్నారులకు ఈ కేన్సర్‌ ముప్పు ఎక్కువ. ఇందులో కణుతులు మందులకు లొంగవని నిపుణులు చెబుతున్నారు. ఈ తరహా మొండి కణుతులే లక్ష్యంగా సూక్ష్మ అణువులను పంపించేందుకు కర్కమిన్‌ తోడ్పడుతుందన్నారు. కణితిని అణిచివేసే సూక్ష్మ అణువులను కర్కమిన్‌కు జతచేసి నేరుగా లక్ష్యానికి చేర్చవచ్చన్నారు. ఇలా ఓ ప్రత్యేక పద్ధతిలో దాడి చేసి కేన్సర్‌ను నియంత్రించవచ్చని చెప్పారు. ఈ విషయంపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు.
 

Thursday, 27 July 2017

రొమ్ము కేన్సర్‌ చికిత్సకు కొత్తరకం మాత్రలు

రొమ్ము కేన్సర్‌ చికిత్సలో ఉపయోగించే కొత్తరకం మాత్రలను శాస్త్రవేత్తల బృందం అభివృద్ధి చేసింది. ఈ బృందంలో భారత సంతతి శాస్త్రవేత్త కూడా ఉన్నారు. సైక్లిన్‌ డిపెండెంట్‌ కినాస్‌ నిరోధకాలుగా వ్యవహరించే ఈ మందులతో దుష్పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం కూడా తక్కువే.


నోటి ద్వారా తీసుకునే ఈ మందులతో హోర్మోన్‌ రిసెప్టార్‌ పాజిటీవ్‌ కేన్సర్‌ను సమర్థవంతంగా నియంత్రించవచ్చని రొమ్ము కేన్సర్‌ చికిత్సా నిపుణుడు ఆదిత్యా బార్డియా పేర్కొన్నారు. కేన్సర్‌ వేగంగా విస్తరించడానికి సీడీకే ఎంజైమ్‌లు తోడ్పడతాయని, తాజాగా అభివృద్ధి చేసిన కొత్తరకం ముందులతో వీటికి అడ్డుకోవచ్చని చెప్పారు.

Wednesday, 26 July 2017

కేన్సర్ కు కొబ్బరినూనె దివ్యౌషధం

కొబ్బరినూనె దివ్యౌషధం అంటున్నారు అమెరికన్ శాస్త్రవేత్తలు. అవును, కొబ్బరినూనె వాడితో రోజుల వ్యవధిలో 90 శాతం పేగు కేన్సర్ దూరమవుతుందట. అమెరికన్ కేన్సర్ సొసైటీ ఆధ్వర్యంలో 95వేల 270 కేసుల్ని పరిశోధించిన వైద్యులు, ఆపరేషన్, రేడియేషన్, కీమోథెరపీ కంటే కొబ్బరినూనె వాడకమే మేలని నిర్థారించారు. రేడియేషన్ ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏవీ కొబ్బరినూనె ద్వారా రావని తేలింది.



కొబ్బరినూనెలో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయని అమెరికన్ శాస్త్రవేత్తలు అర్థం చేసుకున్నారు. బాగా పెరిగిన కొబ్బరికాయ కంటే పెరిగీ పెరగకుండా ఉండే కొబ్బరికాయ నుంచి తీసే ఆయిల్ ఇంకా శక్తివంతంగా పనిచేస్తుంది. కొబ్బరినూనెలోని లారిక్ యాసిడ్ కేన్సర్ నాశక గుణాలను కలిగి ఉంటుంది.

Tuesday, 25 July 2017

కేన్సర్ కి చెక్ పెట్టబోతున్న ఆస్పిరిన్

ఆస్పిరిన్ డ్రగ్ కేన్సర్ ని అరికడుతుందని గత కొద్ది సంవత్సరాలుగా డాక్టర్లు చెప్తూ వస్తున్నారు. కానీ అది ఎంతవరకు నిజమన్నది స్పష్టం చేయలేదు. ఆ ప్రశ్నకు సమధానం చెప్తున్నారు మద్రాసు ఐఐటీకి చెందిన బయోటెక్నాలజీ ప్రొఫెసర్ అమల్ కాంతి బేరా. సింపుల్ పెయిన్ కిల్లర్ భయంకరమైన కేన్సర్ కణాలను నాశనం చేస్తుందని ఆయన ప్రయోగాత్మకంగా చేసి చూపిస్తున్నారు.






ఆస్పిరిన్ అనే నాన్ స్టెరాయిడల్, యాంటీ ఇన్ ఫ్లిమేటరీ డ్రగ్ ప్రాణాంతక కేన్సర్ కణాలపై దాడి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందనే పాజిటివ్ సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ డ్రగ్ కేన్సర్ కణాల్లోని మైటోకాండ్రియాలో ఉన్న అధిక స్థాయి కాల్షియం అయాన్లను ప్రేరేపిస్తుంది. ఫలితంగా ఆహారాన్ని శక్తిగా మార్చకుండా మైటోకాండ్రియాను నిరోధిస్తుంది. ఇలా ఎనర్జీ ప్రొడక్షన్ ఆగిపోవడంతో కేన్సర్ కణాలు క్రమంగా చనిపోతాయి.