Sunday, 7 August 2016

గ్లాసు బీరుతో కేన్సర్ ఖాయం

ప్రతిరోజూ ఒక గ్లాసు బీరు లేదా వైన్‌ తాగితే.. అన్నవాహిక కేన్సర్‌ వచ్చే ప్రమాదం పెరుగుతుందట. అలాగే స్థూలకాయం వల్ల కూడా భారతీయులకు కేన్సర్‌ ముప్పు ఎక్కువగా ఉందట. శారీరక శ్రమలేని జీవనశైలి, స్థూలకాయం, పెరుగుతున్న మద్యపానం అలవాటు కారణంగా భారతీయుల ఆరోగ్యం దెబ్బతింటోందని బెంగళూరుకు చెందిన బేరియాట్రిక్‌, గ్యాసో్ట్రఎంటరాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా 2007 నుంచి 31 వేల మంది కేన్సర్‌ రోగులపై జరిగిన 46 పరిశోధనలను విశ్లేషించిన వీరు.. ముఖ్యంగా ఊబకాయం, ఆల్కహాల్‌ వల్లే.. అన్నవాహిక, క్లోమ, పురీషనాళ, ఛాతీ, కిడ్నీ, థైరాయిడ్‌ వంటి భాగాలకు కేన్సర్‌ వచ్చే అవకాశం ఉందని గుర్తించారు.





                 రోజుకు 10 గ్రాముల ఆల్కహాల్‌ తీసుకునేవారికి కేన్సర్‌ ముప్పు 25 శాతం పెరిగినట్లు వీరు వెల్లడించారు. ఆరోగ్యకర జీవనశైలి, పండ్లు, శాకాహారం తీసుకోవడం, వ్యాయామం ద్వారానే కేన్సర్‌ నుంచి రక్షణ పొందవచ్చని సూచించారు. ఆల్కహాల్ తో కేన్సరే కాదు చాలా రోగాలు వస్తాయని నిపుణులు చెప్పడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా చాలా అధ్యయనాలు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. 

Saturday, 6 August 2016

కేన్సర్ ను నయం చేసే రోబో

కేన్సర్ శస్త్రచికిత్సల కోసం త్వరలోనే హైదరాబాద్‌కు రోబో రాబోతోంది. హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో దీన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రితోపాటు తమిళనాడులోని అడయార్ ప్రభుత్వ కేన్సర్ ఆస్పత్రికి, బెంగళూరులోని కిద్వాయ్ ప్రభుత్వ ఆస్పత్రికి కూడా కేంద్ర ప్రభుత్వం రోబోలను మంజూరు చేసింది. ఈ రోబో విలువ రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకూ ఉంటుంది. ప్రస్తుతం ఎంఎన్‌జేకు మంజూరైన కేన్సర్ రోబో మెషీన్ అత్యంత ఆధునిక వైద్య సేవలకు ఉపయోగించేదని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.


               ప్రస్తుతం కేన్సర్ చికిత్సలో అత్యాధునిక సేవలంటే ల్యాప్రోస్కోపీ శస్త్రచికిత్సలే. చిన్నగాటు వేసి నొప్పిలేకుండా చేస్తున్న వాటినే ల్యాప్రోస్కోపీ చికిత్సలంటారు. దీనికి మించి మెరుగైన సేవలను రోబో అందిస్తుంది. రోబో మెషీన్ మంజూరైన విషయం వాస్తవమని, ఇది ఆస్పత్రికి వచ్చేందుకు ఏడాది సమయం పట్టే అవకాశముందని ఎంఎన్జే ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల కేన్సర్ రోగులకు అద్భుతమైన సేవలు అందుతాయన్నారు. ఏపీ నుంచి కూడా పేద రోగులు ఇప్పటికీ ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రికే వస్తున్నారు.
 

Friday, 5 August 2016

అమ్మో కేన్సర్

కేన్సర్ మహమ్మారి రోజురోజుకీ విజృంభిస్తోంది. కేన్సర్ నివారణ పద్ధతులపై ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నా.. కేన్సర్ రోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దేశంలో కేన్సర్‌తో మరణించే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా కేన్సర్ మరణాల్లో 34% మంది రొమ్ము, గర్భాశయ, నోటి క్యాన్సర్ల కారణంగానే సంభవిస్తున్నాయి. కేన్సర్‌తో మరణించే మహిళల్లో 26.4% మంది రొమ్ము, గర్భాశయ కేన్సర్ల కారణంగానే చనిపోతున్నారని కేంద్ర ప్రభుత్వం ఒక నివేదికలో వెల్లడించింది. ఈ మేరకు దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు ఓ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి.. రాష్ట్రాలకు పంపించింది.


దీర్ఘకాలిక వ్యాధుల్లో ప్రధానంగా కేన్సర్, గుండె జబ్బులు,  మధుమేహం, హైబీపీ, వంటివి ఉన్నాయి. 2012లో దేశవ్యాప్తంగా 1.45 లక్షల మంది మహిళలు రొమ్ము కేన్సర్ బారినపడగా.. వారిలో 70,218 మంది చనిపోయారు. అలాగే ఏటా సగటున సుమారు 1.23 లక్షల మంది మహిళలు గర్భాశయ కేన్సర్ బారిన పడుతుండగా.. అందులో 67,500 మంది మరణిస్తున్నారు. 

Thursday, 4 August 2016

బ్రెస్ట్ కేన్సర్ నివారణకు చిట్కాలు

స్థూలకాయం ఉన్నట్లయితే మెనోపాజ్‌ తరువాత బ్రెస్ట్‌కేన్సర్‌ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. బాడీమా్‌స్ ఇండెక్స్‌  25 లోపల ఉండేలా చూసుకోవాలి. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్‌, ఫ్యాటీ ఫుడ్స్‌ తక్కువగా తీసుకోవాలి. ధాన్యాలు ఎక్కువగా తినాలి. ప్రతిరోజు అరగంటపాటు వ్యాయామం చేయాలి. ఫిజికల్‌గా యాక్టివ్‌ ఉన్న వారిలో బ్రెస్ట్‌ కేన్సర్‌ రిస్క్‌ 30 శాతం వరకు తగ్గిపోతుంది. హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరఫీ వల్ల బ్రెస్ట్‌ కేన్సర్‌ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ తప్పనిసరిగా హార్మోన్‌ థెరపీ తీసుకోవాల్సి వస్తే ప్రొజెస్టిరాన్‌ ఉన్న మందులను తీసుకోకూడదు. తీసుకోవాల్సి వచ్చినా ఎక్కువ కాలం వాడకూడదు.
         

         బయోఐడెంటికల్‌ హార్మోన్స్‌, హార్మోనల్‌ క్రీమ్స్‌, జెల్స్‌కు దూరంగా ఉండాలి. ఒక ఏడాది పాటు పిల్లలకు పాలిచ్చే తల్లులకు బ్రెస్ట్‌ కేన్సర్‌ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి వీలైనంత వరకు బ్రెస్ట్‌ఫీడింగ్‌ను కొనసాగించాలి. కుటుంబసభ్యుల్లో బ్రెస్ట్‌కేన్సర్‌ వచ్చిన చరిత్ర ఉన్న మహిళలు, అరవై ఏళ్లు పైబడిన వారు ఈస్ర్టోజన్‌ బ్లాకింగ్‌ డ్రగ్స్‌ ఉపయోగించే ముందులు వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి.

Wednesday, 3 August 2016

పసుపుతో కేన్సర్ కు చెక్

ప్రాణాంతక సమస్యల్లో పెద్దపేగు కేన్సర్ ఒకటి. ఇటీవల ఇలాంటి కేన్సర్ కేసులు పెరగటం ఏంతో ఆందోళన కలిగిస్తోన్న అంశం. తగిన జాగ్రత్తలు తీసుకొంటే ఈ సమస్యను నివారించటం సాధ్యమే. తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమైన తర్వాత మిగిలిన వ్యర్ధాలు మలంగా మారతాయి. దీనిని బయటికి పంపటమే పెద్దపేగు పని. పెద్దపేగు)కు సోకిన కేన్సర్ ను కొలన్ కేన్సర్ అనీ, పెద్దపేగు చివరి భాగమైన పాయువుకు సోకితే రెక్టల్ కేన్సర్ అంటారు. పసుపుకు పెద్ద పేగు కేన్సర్‌ను నివారించే శక్తి ఉందని సెయింట్ లూయిస్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.



        పసుపు దుంపలను సిలిమారిన్ తో కలిపి ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుందన్నారు. కాలేయ వ్యాధి నివారణకు సంబంధించి ఈ మిల్క్ తిస్టిల్ ఎక్కువ ఉపయోగిస్తుంటారు. అయితే ఈ పరిశోధన ఇంకా కొనసాగుతోంది. త్వరలో అన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.  పెద్ద పేగుకు కేన్సర్ సోకినప్పుడు పేగు బిగుసుకు పోవటం, పేగులోపల తిత్తులు(పాలిప్స్) ఏర్పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో ఈ లక్షణాలు అసలు కనిపించక పోవచ్చు. పెద్దపేగు కేన్సర్ వంశపారంపర్యంగా వస్తుందని చెప్పే ఖచ్చితమైన ఆధారాలు లేకపోయినా రాదని మాత్రం గ్యారెంటీ లేదు. అందుకే పెద్దలకు ఈ సమస్య ఉన్నప్పుడు ముందు జాగ్రత్తగా 15 ఏళ్ళు నిండిన వారి పిల్లలకు ఏడాదికి ఒకసారి ఈ పరీక్షలు చేయించటం అవసరం. 

బ్రెస్ట్ కేన్సర్‌ లక్షణాలు

స్త్రీల పాలిట మహమ్మారి బ్రెస్ట్ కేన్సర్‌ నిరోధానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని మార్గదర్శక సూత్రాలు రూపొందించింది. మహిళలు రజస్వల అయిన అనంతరం నెలకు రెండుసార్లు చొప్పున తమ వక్షోజాలను పరిశీలిస్తూ, ఈకింది అంశాలేవీ లేవని నిర్ధారించుకోవాలి.  వక్షోజంలో గడ్డలు, కణుతులు వంటివి ఉన్నాయా?
ఒకవేళ ఏమైనా గడ్డవుంటే, దానిపై చర్మం కదులుతోందా? గట్టిగా కదలకుండా ఉందా?  గొంతు, మెడ, చంకల వద్ద ఏమైనా గడ్డలుగాని కణుతులుగాని ఉన్నాయా?


             వక్షోజంపై ప్రత్యేకించి ఒక ప్రదేశంలో చర్మం రంగు మారిందా? ఆ చనుమొననుంచి రక్తం స్రవిస్తోందా?  వక్షోజంలో అల్సర్‌ ఉందా? వక్షోజం రంగు పాలిపోయిన ఆరం జిరంగులోకి మారిందా? వక్షోజం ఒకవైపునుంచి మరోవైపుకు కదులుతోందా? లేదా? నొప్పిగా ఉందా? ఈ అంశాలలో ఏ ఒక్కటి గుర్తించినా.. వెంటనే కేన్సర్‌ స్పెషలిస్టును సంప్రదించండం తప్పనిసరి. అంతేకాకుండా కేన్సర్ స్పెషలిస్టులు చెప్పే ముఖ్యమైన జాగ్రత్తలు వెంటనే పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

Monday, 1 August 2016

పోషకాహారంతో కేన్సర్ దూరం

ఆరోగ్యమైన కొవ్వుతో ఉండే మధ్యధరా ఆహారమైన ఫ్యాటీ ఫిష్‌, గుడ్లు, ఆలీప్‌ అయిల్‌, అవకాడోస్‌, వివిధ రకాల గింజలు మొదలైన వాటిని తీసుకుంటే గుండె జబ్బు, టైప్‌-2 మధుమేహం, బ్రెస్ట్‌ కేన్సర్‌ వంటి జబ్బులు అభివృద్ధి కాకుండా ఉంటాయని ఓ పరిశోధనలో తేలింది. అధిక కొవ్వు పదార్థలు సేవించడానికి వివిధ రుగ్మతలు తగ్గుముఖం పట్టాడానికి యాంటీ ఇన్‌ప్లెమేటరీ ప్రభావం కారణమని అమెరికాలోని క్రానిక్‌ డిసీజ్‌ ఔట్‌కమ్స్‌ రీసర్చ్‌ కేంద్రానికి చెందిన హన్నా బ్లూమ్‌ఫీల్డ్‌ తెలిపారు. అధిక కొవ్వు తీసుకోవానికి, మరణాలకు సంబంధం లేదన్నారు. కొవ్వును పరిమితంగా తీసుకునే వారు, చెక్కర, శుద్ధి చేయని ధన్యాల నుంచి కెలరీలను పొందుతుంటారని బ్లూమ్‌ఫీల్డ్‌ పేర్కొన్నారు.
     

పండ్లు, కూరగాయలలో ఉండే విటమిన్, మినరల్స్ కేన్సర్ వ్యాధికి వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడతాయి. ఇవి కేన్సర్ వ్యాధి వలన ప్రమాదానికి గురైన కణాలను తిరిగి యధా స్థానానికి తీసుకురావటంలో సహాయపడతాయి.  మాంసం, రెడ్ మీట్ వంటి వాటికి దూరంగా ఉండాలి. వీటికి బదులుగా పోషకాలు అధికంగా గల పండ్లు మరియు కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి.