Sunday, 14 August 2016

వక్కపొడితో కేన్సర్ డేంజర్



వివాహాలు, శుభకార్యాలప్పుడు వక్కపొడి ఇవ్వడం మనకు తెలుసు. కానీ ఆ వక్కపొడి కేన్సర్ కు కారకంగా మారుతుందని తాజా పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. ఆ ఒక్కటే కాదు అనేక రకాల వ్యాధులకు కారణమవుతున్నాయట. పాన్‌లో ఉప‌యోగించే త‌మ‌ల‌పాకు, యాల‌కులు, దాల్చిన చెక్క వరకు సరే. మిగ‌తా ప‌దార్థాల‌న్నీ ప్రాణాంత‌క క్యాన్స‌ర్‌ల‌ను కలుగజేస్తున్నాయని ది ఇంట‌ర్నేష‌న‌ల్ ఏజెన్సీ ఫ‌ర్ రీసెర్చ్ సంస్థ‌  ప‌రిశోధ‌కులు తేల్చారు. ఈ విష‌యాన్ని ప్ర‌యోగాత్మ‌కంగా ధృవీక‌రించారు. కేన్సర్ లను క‌లిగించే ప‌దార్థాల‌న్నింటిలో వ‌క్క ప‌లుకులు ప్ర‌థ‌మ స్థానంలో ఉందని చెబుతున్నారు వాళ్లు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వ‌క్క‌పొడి తిన‌డం వ‌ల్ల కేన్సర్ వచ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయని చెప్పింది.



అదే పనిగా వక్క నమలం వల్ల నోరు, అన్న వాహిక‌ల‌కు చెందిన క్యాన్స‌ర్లు వ‌స్తాయ‌ని తేలింది. వ‌క్క‌పొడి ఎక్కువ‌గా తింటే స‌బ్ మ్యూక‌స్ ఫైబ్రోసిస్ అధికంగా ఉత్ప‌త్తి చెందుతుంది. అది ద‌వ‌డ క‌ద‌లిక‌ల్లో అంత‌రాయం కలిగిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ద‌వ‌డ‌లు పూర్తిగా బిగుసుకుపోయి ఏమీ తిన‌డానికి, తాగ‌డానికి వీలు పడదట. నోటికి రంధ్రాలు ప‌డి తిన్న‌దంతా బ‌య‌టికి వ‌స్తుంద‌ని చెబుతున్నారు. అలాంటి ప్ర‌మాద‌క‌ర నోటి క్యాన్స‌ర్ వ‌చ్చేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌. వ‌క్క ప‌లుకులను ఎక్కువ‌గా తింటే దంతాలు, చిగుళ్లు రంగు మారుతాయి. వాటికి అల్స‌ర్లు వ‌స్తాయి. వ‌క్క ప‌లుకుల‌ను తినే స‌మ‌యంలో జీర్ణాశ‌యంలోకి అది వెళితే స‌మస్య‌లు వస్తాయి. గుండె జ‌బ్బులు వ‌చ్చే వీలు ఉందని వారు చెబుతున్నారు. 

Saturday, 13 August 2016

బ్రెడ్ తో కేన్సర్ ఖాయం



పిజ్జాలో బ్రెడ్‌... బర్గర్‌లో బ్రెడ్‌.... చాయ్‌లోకి బన్ను... బట్టర్‌, జామ్‌ రాసిన బ్రెడ్‌ ముక్కలు... జ్వరమొస్తే ఆహారంగా బ్రెడ్‌. ఇంకా... శాండ్‌విచ్‌లు, పావ్‌భాజీ, టోస్టులతోపాటు రకరకాల రూపాల్లో బ్రెడ్‌ను మింగేస్తున్నాం. మొత్తానికి బ్రెడ్‌తో మనిషికి అవినాభావ ఆహారబంధం. అయితే... ఇదే బ్రెడ్డులు, బన్నులలో కేన్సర్‌ కారక రసాయనాలున్నాయని తేలింది. ప్రముఖ స్వచ్ఛంద సంస్థ సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఈ సంగతి తేల్చింది. బ్రెడ్డు తయారీలో పొటాషియం బ్రోమేట్‌, పొటాషియం అయోడేట్‌ ఉపయోగిస్తారు. కేన్సర్‌ కారక రసాయనాల జాబితాలో పొటాషియం బ్రోమేట్‌కూడా ఒకటి. ఇక పొటాషియం అయేడేట్‌వల్ల శరీరంలో అయోడిన్‌ స్థాయి పెరిగి థైరాయిడ్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. అంతిమంగా... థైరాయిడ్‌ కేన్సర్‌ రావొచ్చు. ప్రము ఖ కంపెనీలుసహా మార్కెట్‌లోగల బ్రెడ్‌లు, బన్నులపై సీఎ్‌సఈ పరీక్షలు చేసింది. బేకరీల నుంచి సేకరించిన 84 శాతం శాంపిల్స్‌లో బ్రోమేట్‌, అయోడేట్‌ అవశేషాలున్నట్లు తెలిపింది.





                             పొడి లేదా గుళికల రూపంలో ఉండే పొటాషియం బ్రోమేట్‌కు రంగు, రుచి, వాసన ఉండవు. దీన్ని పులియబెట్టే ఉత్ప్రేరకంగా వాడతారు. దీనివల్ల కేన్సర్‌ ముప్పుందని అంతర్జాతీయ కేన్సర్‌ పరిశోధన సంస్థ నిర్ధారించింది. ఈ రసాయనాన్ని కేటగిరీ-2బీలో చేర్చింది. దీనివల్ల కడుపునొప్పి, డయేరియా, తల తిరగడం, వాంతులు, కిడ్నీ వైఫల్యం, చెవుడు, బీపీ, డిప్రెషన్‌వంటి సమస్యలూ తలెత్తుతా యని వివిధ పరిశోధనల్లో తేలింది. ఈ రసాయనాన్ని ఆహార పదార్థాల తయారీలో వినియోగించరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఎఫ్‌ఏవోల సంయుక్త నిపుణుల కమిటీ ఎప్పుడో స్పష్టం చేశాయి. బ్రోమేట్‌ను అనేక దేశాల్లో నిషేధించారు. పొరుగునే ఉన్న శ్రీలంక, చైనాల్లోనూ నిషేధం ఉంది.

సాఫ్ట్ డ్రింక్స్ తో ప్రోస్టేట్ కేన్సర్



సాఫ్ట్‌ డ్రింక్స్‌ ఎక్కువుగా తాగే పురుషుకు ప్రొస్టేట్‌ కేన్సర్‌ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయట. స్వీడన్‌కు చెందిన శాస్తవ్రేత్తల నూతన పరిశోధనలో ఈ విషయం వెల్లడెైంది. ఈ అంశంపెై పదిహేనేళ్ల పాటు సుదీర్ఘ అధ్యయనం చేశారు. ఒక రోజుకు సుమారు 300 ఎంఎల్‌ సాఫ్ట్‌డ్రింక్‌ను తాగే పురుషులకు ఈ వ్యాధి వచ్చే అవకాశాలు 40 శాతం వరకు ఉన్నాయి. సాఫ్ట్‌ డ్రింక్‌ తాగని వారితో పోల్చి చూసినపుడు ఈ ఫలితాలు వచ్చాయి. రక్తపరీక్షల ద్వారా మాత్రమే ప్రొస్టేట్‌ కేన్సర్‌ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అవుతుందని డెయిలీ మెయిల్‌లో పేర్కొన్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇన్సులిన్‌ హార్మోన్‌ విడుదలకు షుగర్‌ కారణమవుతుంది. ఈ అధ్యయనానికి సంబంధించిన అం శాలను అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ న్యూట్రిషన్‌లో ప్రచురించారు.



గత అధ్యయనంలో కూడా పలు అంశాలు వెల్లడయ్యాయి. సాఫ్ట్‌ డ్రింక్‌ మోతాదుకు మించి తాగే పురుషలలో గుండెనొప్పులు, మధుమేహం, ఒబెసిటీ, పెళుసుగా ఉండే ఎముకలు, పాంక్రియాటిక్‌ కేన్సర్‌, కండరాల బలహీనత, పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువ. 45-73 సంవత్సరాల వయస్సు గల 8,000 మంది పురుషులపెై పదిహేనేళ్లపాటు శాస్తవ్రేత్తలు అధ్యయనం చేశారు. రెైస్‌, పాస్తా, కేక్‌లు, బిస్కెట్లు, తియ్యగా ఉండే తృణధాన్యాల అల్పాహారం తీసుకుంటే ప్రొస్టేట్‌ కేన్సర్‌ వ్యాధి తీవ్రత తగ్గేందుకు తోడ్పడతాయి. 

Thursday, 11 August 2016

పోషకాహారంతో కేన్సర్ దూరం



పోషకాల సహాయంతో కేన్సర్ వ్యాధిని తగ్గించాలనుకుంటున్నారా? అయితే వీటితో పాటుగా మందుల సహాయం కూడా అవసరమే, ఎందుకంటే కేన్సర్ ఆరోగ్యకర కణాలకు సోకకుండా ఉండాలంటే మందుల సహాయం తప్పక అవసరం. పోషకాలతో కూడిన ఆహార పదార్థాలు మరియు మందులు కలిస్తే కేన్సర్ వ్యాధికి వ్యతిరేకంగా పోరాడే అద్భుతమైన ఆయుధమని చెప్పవచ్చు. వీటి వలన పూర్తి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.



            తినే ఆహారాన్ని సరైన పద్దతిలో వండుకోవాలి. శరీరంలో అనారోగ్యాలను కలిగించే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా జంక్ ఫుడ్ కు వీలైనంత దూరంగా ఉండాలి. జంక్ ఫుడ్ మాత్రమే కాకుండా, ఇంట్లోనే వండే నూనె, చక్కెర, అనారోగ్యకర కొవ్వు కలిగి ఉండే ఆహారాలకు ,శరీరానికి కావలసిన మినరల్ మరియు విటమిన్ లు లేని ఆహార పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి. కూరగాయలు, పండ్లు మరియు ఫైబర్ ఇతర ఆహార పదార్థాలు కేన్సర్ వ్యాధి పెరుగుదలకు వ్యతిరేఖంగా పోరాడటమే కాకుండా, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

లంగ్ కేన్సర్ కు క్యూబా మందు

అమెరికా పక్కనే ఉండే చిన్న ద్వీపం క్యూబా. పంచదార ఎక్కువగా పండించే ఈ దేశం లంగ్ కేన్సర్ రోగులకు ఒక తీపి వార్తను వినిపించింది. క్యూబా రాజధాని హవానాలో ఉన్న సెంట్రో దీ ఇమ్యునలోజియా మాలిక్యూల్ అనే పరిశోధనా కేంద్రంలో పనిచేసే శాస్త్రవేత్తలు ప్రపంచ వ్యాప్తంగా చాలా మందిని పట్టి పీడిస్తున్న లంగ్ కేన్సర్ భూతానికి వేక్సిన్ ను కనుగొన్నారు. దీనితో ఈ పరిశోధనా కేంద్రం పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టుల దృష్టి పడింది. సిం అవాక్స్ పేరుతో పిలిచే ఈ వేక్సిన్ ను ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 5 వేల మందిమీద ప్రయోగించి సంతృప్తికర ఫలితాలు సాధించారట. 

 
ఈ వేక్సిన్ తీసుకున్న కేన్సర్ రోగుల జీవిత కాలం తీసుకొని వారికంటే సగటున 11 నెలలు ఎక్కువగా ఉందని సమాచారం. ఈ వేక్సిన్ తీసుకున్న ఆల్బర్ట్ సాన్చేజ్ అనే 77 ఏళ్ల వృద్ధుడు మాత్రం 2002 లోనే లంగ్ కేన్సర్ బారిన పడినా ఇప్పటికీ జీవించే ఉన్నాడు. వేక్సిన్ తో పాటు తనకున్న మనోధైర్యమే అతని జీవిత కాలం పెరగటానికి కారనామని ఆ సైంటిస్టులు అన్నారు. ఈ వేక్సిన్ ఇతర కేన్సర్ ఔషదాలలాగా కేన్సర్ కణాలను నేరుగా చంపివేయదని, శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచి అది కేన్సర్ కణాలను చంపేలా చేస్తుందని అంటున్నారు. క్యూబాలోని ఈ పరిశోధనా కేంద్రం ఇప్పటివరకు 21 ప్రాణాంతక రోగాలకు వేక్సిన్లను కనుగొన్నది.

Tuesday, 9 August 2016

శ్వాసతో లంగ్ కేన్సర్ గుర్తింపు



ప్రాణాంతక ఊపిరితిత్తుల కేన్సర్‌ను మొదటిదశలోనే పసిగట్టేందుకు సరికొత్త పరికరాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. లంగ్‌ కేన్సర్‌ ఇండికేటర్‌ డిటెక్షన్‌, లూసిడ్  గా వ్యవహరిస్తున్న ఈ పరికరం.. శ్వాసను పరీక్షించడం ద్వారా ఊపిరితిత్తుల కేన్సర్‌ జాడలను ఇట్టే పసిగడుతుందని అన్నారు. కేంబ్రిడ్జికి చెందిన ఓవల్‌స్టోన్‌ నానోటెక్‌ లిమిటెడ్‌ కంపెనీ ఈ పరికరాన్ని అభివృద్ధి చేసింది. లంగ్‌ కేన్సర్‌ సోకిన తర్వాత బాధితుల జీవితకాలం ఐదేళ్లకు పడిపోతుంది.
                         



లంగ్ కేన్సర్ ను ముందుగా గుర్తించడం వల్ల బాధితులను రక్షించేందుకు అవకాశం లభిస్తుందని ఓవల్‌స్టోన్‌ సహ వ్యవస్థాపకుడు బిల్లీ బోయలే తెలిపారు. ప్రస్తుతం తుది పరిశీలన దశలో ఉన్న లుసిడ్‌ను ఏడాదిలో మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ పరికరంతో లంగ్‌ కేన్సర్‌ను ఖచ్చితంగా నిర్ధారించవచ్చని వివరించారు.

Monday, 8 August 2016

ఫ్రూట్స్ తో లంగ్ కేన్సర్ దూరం





పొగతాగే అలవాటు ఉన్న వారు లంగ్‌ క్యాన్సర్‌ ముప్పును తగ్గించుకోవాలంటే.. ప్రతిరోజూ ఎనిమిది రకాల ఫ్రూట్స్‌ తీసుకోవాలి. ప్రతిరోజూ రకరకాల ఫ్రూట్స్‌ తీసుకుంటే లంగ్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు 23 శాతం మేర తగ్గుతాయి. ఈ విషయం ఇటీవల జరిపిన ఓ పరిశోధనలో వెల్లడయింది. రోజూ ఐదు రకాల పళ్లు, కూరగాయలు తీసుకుంటే రూన్సర్‌ రాకుండా నివారించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్న సంగతి తెలిసిందే.



               యూరప్ లోని ఒక సంస్థ పలు దేశాలలో లంగ్‌ క్యాన్సర్‌పై పరిశోధనలు నిర్వహించింది. ఇందులో ఎక్కువ ఫ్రూట్స్‌ తీసుకోవడమే కాకుండా, రకరకాల కూరగాయలు తీసుకునే వారిలో కూడా లంగ్‌ క్యాన్సర్‌ రిస్క్‌ చాలా వరకు తక్కువగా ఉందని వెల్లడయింది. పొగతాగే అలవాటు మానుకోలేకపోతే ఫ్రూట్స్‌నైనా ఎక్కువగా తినాలని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు క్యూబాలో లంగ్ కేన్సర్ కు కొత్త వ్యాక్సిన్ కనిపెట్టారు. అయితే ఇదింకా పరిశోధన దశనలోనే ఉందని, త్వరలోనే ఫలితాలు వెల్లడలిస్తామని సైంటిస్టులు చెబుతున్నారు.