కేన్సర్ వ్యాధి సంక్రమించడానికి కారణం ఫలానా అని చెప్పలేకపోవచ్చు కానీ దాన్ని నిరోధించేందుకు మాత్రం ప్రత్యేకంగా కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటుంటే వ్యాధిని అడ్డుకోవచ్చని పరిశోధనాల్లో తేలింది. ప్రపంచ కేన్సర్ డే ఫిబ్రవరి 4 సందర్భంగా ఆ వివరాలను తెలుసుకుందాం. ప్రతిరోజూ తినే ఆహారంలో అత్యధిక స్థాయిల్లో ఫైబర్ నిల్వలున్న పదార్థాలను తీసుకునేవారిలో కేన్సర్ వ్యాధి రావడం చాలా తక్కువ. పండ్లు, కూరగాయలు వంటివి ఎక్కువగా తీసుకునే మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్ వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెపుతున్నాయి. అంతేకాదు ప్రొస్టేట్ కేన్సర్ రాకుండా అడ్డుకోవడంలో పండ్లు, కూరగాయలు కీలక పాత్రను పోషిస్తాయి.
2015లో చైనా పరిశోధనల ప్రకారం తెల్లని కూరగాయలు, బంగాళాదుంపలు, క్యాలీఫ్లవర్ వంటివి తీసుకుంటుంటే కేన్సర్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. వీటిని తీసుకునేవారిలో వ్యాధి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే జీర్ణాశయ కేన్సర్‌ను కూడా అడ్డుకునే శక్తి వీటికి ఉంది. కాఫీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. ముఖ్యంగా ఉదయం పూట కాఫీని సేవించేవారిపై చేసిన అధ్యయనంలో 42 శాతం మందికి ఈ వ్యాధి రాకుండా ఉన్నట్లు కనుగొన్నారు. కాఫీ తీసుకోని వారిలో ఈ వ్యాధి 34 శాతం మందికి సోకినట్లు తేలింది. కనుక మోతాదుకు మించని కాఫీ సేవనం ఆరోగ్యానికి మంచిదేనంటున్నారు పరిశోధకులు. రెండు కప్పులకు మించి కాఫీ తాగడం కూడా మరో రకమైన అనారోగ్యాన్ని తెస్తుంది. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి.
వారంలో రెండుసార్లు చేపలను తీసుకోవడం వల్ల కేన్సర్ వ్యాధికి చెక్ చెప్పవచ్చంటున్నారు. చేపలు తీసుకునేవారిపై చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయింది. ముఖ్యంగా బ్రెస్ట్ కేన్సర్ ను నిరోధించడంలో ఈ ఆహారం కీలక పాత్రను పోషిస్తుందని తేలింది. మరి తినకుండా తప్పించుకోవాల్సిన పదార్థం ఏమైనా ఉన్నదా అంటే... అత్యధిక స్థాయిలో చక్కెర నిల్వలు ఉన్న పదార్థాలు. వాటిని తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. వీటిలో కేన్సర్ కూడా ఒకటి. కనుక ఆకలిగా ఉంది కదా అని ప్యాక్ చేసి ఉంచి బిస్కెట్లు, చక్కెర నిల్వలు అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి.

No comments:
Post a Comment